S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

హాట్ హాట్ ఇషా!

అందాల బాలీవుడ్ తార ఇషాగుప్తా ఇప్పుడు సోషల్ మీడియాని హల్‌చల్ చేస్తోంది. ఇటీవల ఆమె నెటిజన్ల మతిని పోగొట్టేలా ఫొటో షూట్‌ని చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో దర్శనమిచ్చింది. ఆ ఫొటో షూట్ మామూలుదైతే ఫర్వాలేదు కానీ, టాప్‌లెస్‌గానూ, లోదుస్తుల్లో అర్ధనగ్నంగా ఉండడంతో యువతను కిక్కెస్తోంది. అలా నెటిజన్లను తన అందాల ఆరబోతతో కిక్ ఎక్కించాలన్నదే తన లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ ఫొటో షూట్ పెద్ద వైరల్‌గా మారింది. చాలా మంది ఇన్‌స్ట్రాగ్రామ్ ప్రేమికులు ఆమె ఫొటోలను తనివితీరా చూసి పరవశించిపోతూ తమకు ఇష్టం వచ్చిన రీతిలో కామెంట్లు పెడుతున్నారు. ఈ కామెంట్లపై ఇషా స్పందిస్తూ- ‘‘నాకు నచ్చిన ఫొటో షూట్ ఇది. అందుకే నేను సోషల్ మీడియాలో ఈ విధంగా దర్శనమిచ్చాను. నా ఫొటోలు ఎవ్వరికి ఏ విధంగా అనిపించినా నేనేం పట్టించుకోను. నాకు నచ్చిందే నేను చేశాను. ఈ ఫొటోలపై కామెంట్లు చూసి నాలో నేనే నవ్వుకుంటున్నా. వీటిని నేను ఏ మాత్రం లేక్క చేయను’’అంటోంది. తాజాగా ఇషాగుప్తా అజయ్ దేవగణ్‌కు జోడీగా ‘బాద్‌షాహో’లో నటించింది. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం విడుదలయ్యాక ఇషా ఫవరేంటో తెరపై చూస్తారు అని కూడా చెప్పుకొచ్చింది. చూద్దాం.. ఈ చిత్రంలో ఇంకా ఏం చేయనుందో!

-సమీర్