S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వాహ్..ప్రియాంక!

..అంటున్నారు బాలీవుడ్ సినీ దిగ్గజాలు. వారు అలా అనడానికి కారణం లేకపోలేదు. బాలీవుడ్‌లో ఎన్నో మంచి పాత్రలు చేసి, అగ్ర హీరోలతో జోడీకట్టి నటిగా వంద మార్కుల్ని కొట్టేసింది. తన ఇమేజ్‌ని ఎక్కడికో తీసుకెళ్లింది. అది..గతం! మరి ఇప్పుడు హాలీవుడ్‌లోనూ మెరుపులు కురిపిస్తోంది. అక్కడ క్షణం తీరిక లేకుండా గడుపుతోంది ప్రియాంక. ఫలితంగా బాలీవుడ్ సినిమాలకు దూరంగా వుంది. హాలీవుడ్‌లో ప్రియాంక నటిస్తున్న ‘ఎ కిడ్ లైక్ జేక్’, ‘ఇజింట్ రొమాంటిక్’ సినిమాల చిత్రీకరణ ముగించుకొని మన దేశానికి రాబోతోంది. ‘బాజీరావ్ మస్తానీ’ తర్వాత బాలీవుడ్‌లో మరో చిత్రం చేయలేదు. ఇండియాకు రాగానే ప్రియాంక చేయబోయే బాలీవుడ్ చిత్రం గురించి వివరాలు వెల్లడించనుందట. సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో ఓ చిత్రం అంగీకరించినట్లు చెబుతున్నారు. ఈ చిత్రానికి ‘గుప్తా కియాన్’ అనే పేరు బహాటంగా వినిపిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రియాంక ఇండియా వచ్చాకే వెల్లడించనున్నట్లు తెలిసింది. వాహ్..ప్రియాంక!!

-సమీర్