S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సన్సీ హవా!

ఐటమ్ భామల రూటే సపరేటు! అలా అని అందరూ ఐటమ్సే అనుకుంటే పొరపాటే..! అందులో పోర్న్‌స్టార్, బాలీవుడ్ ఖతర్నాక్ ఫిగర్ సన్నీ లియోన్‌ది ప్రత్యేక శైలి. ప్రేక్షకుల్లో ఆమెకున్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. సన్నీ ఎక్కడికెళ్లినా హాట్ హాటే! కమర్షియల్ సినిమాలకు ఎన్ని హంగులున్నా ఐటమ్ పాటల ప్రత్యేకతే వేరు. ప్రతి చిత్ర పరిశ్రమలోనూ ప్రత్యేక గీతాల హవా కొనసాగుతూనే వుంది. ఐటమ్ గర్ల్స్ అంటే మనకు ఠక్కున గుర్తుకు వచ్చే భామ సన్నీలియోనే. ఈ మధ్య షారుఖ్‌ఖాన్‌తో ‘రారుూస్’లో ‘లైలా ఓ లైలా..’ అంటూ ప్రేక్షకుల్ని తన గ్లామర్‌తో చిత్తుచేసేసింది. ‘బాద్ షాహో’లోనూ ‘పియామోర్’ అంటూ ఇమ్రాన్ హష్మీతో అందాల మోతాదును పెంచి మరీ రెచ్చిపోయింది. తాజాగా ‘ట్రిప్పీ..ట్రిప్పీ..’అంటూ మరో అడుగు ముందుకేసింది. సంజయ్‌దత్ చాలా కాలం తర్వాత నటిస్తున్న ‘్భమి’ చిత్రంలో ‘ట్రిప్పీ..ట్రిప్పీ..’అంటూ సాగే ఈ పాటను ఇటీవలే చిత్రీకరించారు. ఈ పాటలో చుట్టూ డాన్సర్‌తో కలిసి సన్నీలియోన్ చేస్తున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడే సందడి చేస్తున్నాయి. ఈ డ్యాన్స్‌కు గణేష్ ఆచార్య నృత్య దర్శకత్వం వహించారు. ఇలా సన్నీ హవా నిరంతరం కొనసాగుతూనే వుంది. దటీజ్..సన్నీ!!

-సమీర్