S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

లోకకల్యాణం

ఓ సృష్టికర్తా
నీవిచ్చే వరం...
లోక కల్యాణానికి ఆలంబన కావాలి
లోక వినాశనానికి కాదు
నిత్య శ్రమ జీవనానికి ఆరంభం కావాలి
సోమరితనానికి కాదు
సహకారానికి పునాది కావాలి
అపకారానికి కాదు
తన సర్వస్వాన్ని దోచిపెట్టే గుణం పెంపొందాలి
దోచుకునే తత్వం కాదు
ఒక్కమాటలో చెప్పాలంటే మానవత్వం
మరచిపోకుండా ఉండాలి
దానవత్వాన్ని కాదు
వరాలివ్వడమే పెద్దరికమనుకుంటే ఎలా
లా అండ్ ఆర్డర్‌కు భంగం వాటిల్లితే
అవతారాలెత్తే సమయం కూడా రాలేదు
కాస్త ముందు వెనుక ఆలోచించుకో
అని హెచ్చరించాడు చక్రధారి
ఆ చతుర్ముఖ బ్రహ్మ విన్నాడో లేదో కాని
లోకంలో దౌష్ట్యానికి బలం పెరుగుతూనే ఉంది.
*

-అమరవాది రాజశేఖర శర్మ 9848996559