S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మరి కొందరు శ్రమజీవులు-అనాథలు

జనాభా లెక్కల్లోనికి చేరినా కూడా
సమాజంలో... ఇట్లే ఉంటుందన్నట్లు - రివాజుగా
రోజూ చూసీ చూడకుండా
అతి నిర్లక్ష్యంగా ఉపేక్షించబడుతూన్న-
హృదయమున్న ప్రతివారూ పట్టించుకోదగిన
మరి కొందరు శ్రమ జీవులూ, అనాథలూ ఉన్నారు సుమా!

ఆ శ్రమ జీవులు ఎవరంటే...
పిపీలికాల వలెనే
తమ శక్తికన్నా మించి, పదింతలుగా-
శారీరకంగా, మానసికంగా కృంగదీయగలిగిన
బరువైన బ్యాగులనూ, అంతకన్నా ఎక్కువైన,
బలవంతంగా రుద్దబడిన కలల, ఆశల గమ్యాలనూ
అమాయకంగా వీపుపైన మోస్తూన్న
ముక్కుపచ్చలారని చిన్నారి బడిపిల్లలే!

ఆ అనాథలు ఎవరంటే...
ఈ సౌందర్య జగతిని చూసే నూరేళ్ల అదృష్టాన్నీ,
ఎనె్నన్నో అద్భుతాలను సాధించే స్వర్ణావకాశాన్నీ..
జన్మరూపంలో ప్రసాదించిన ప్రత్యక్ష దేవుళ్లూ అనీ...
తమ సంతానం చేతనే మరవబడి
కరివేపాకుల వలె తీసివేయబడుతూ
కలిమీ లేముల తేడాలు లేకుండా
అందరూ ఉండి కూడా
ఒంటరి కీకారణ్యంలో బిక్కుబిక్కుమంటూ
బ్రతుకులను క్షణక్షణ నరకప్రాయంగా
వెళ్లదీసే వయోవృద్ధులైన తల్లిదండ్రులే!

-రఘువర్మ 9290093933