S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వృక్షమా! జోహారు!

నేల మీద మట్టి
ఆకాశంలో మబ్బులు
మబ్బుల్లోని నీరు
ధార అయి ధరణికి చేరింది
అది జీవామృతమై
మట్టిలోని విత్తు మొలకెత్తింది

మొలక మానై, మాను కొమ్మలై
కొమ్మలు రెమ్మరెమ్మలై
రెమ్మలన్నింట అనేకానేక ఆకులై
ఆకు ఆకుకు ఒక పూవై
పుష్పాలు ఫలదీకరించి
కాయలైనవి, పళ్లయినవి
ఆ ఫలాలె అన్నమై ఆహారమై
మనిషికి ప్రాణాధారమైనవి

మనిషి కోరినవిచ్చావు నీవు
మనిషినేమీ కోరలేదు నీవు
వృక్షమా! జోహారు!
దేశం కాదు ప్రాంతం కాదు
కొండ కాదు కోన కాదు
భాష కాదు జాతి కాదు
నీకు అభ్యంతరం
సర్వజనులకు
సమాన ఫలదాయినివి
సామ్యవాద ప్రతీకవు నీవు
వృక్షమా! జోహారు!

పక్షులకు గూడువై
గూడుకు నీడవై
పక్షి జాతికి వాసమై
ఆవాసమైనావు
వృక్షమా! జోహారు!

వేణువై వీణవై
కర్ణామృత హేలవై
ఆనందాన్నిచ్చి
అలరించావు అందరినీ
వృక్షమా! జోహారు!

దేవలోకంలో
కల్పవృక్షానివి
భూలోకంలో
అనల్ప వృక్షానివి
నీకున్నది అందరికీ పంచి
ఆనందించావు
వృక్షమా! జోహారు!

-మనె్న సత్యనారాయణ 9989076150