S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నానీలు

గ్రామాల్లోని
మంచినీళ్ల చెరువుల్ని
ఇళ్ల స్థలాలు
తాగేసాయి!

గ్రామీణుల
పడికట్టు సంభాషణ
తెగని వరికంకి
గొలుసుకట్టు!

రాజమండ్రి
గోదావరి జలాలు
కాటన్ సంస్మరణతో
సవ్వడి చేస్తుంటాయి!

పిసినారి
సత్రంలో తిన్నాక
ఎంగిలి చేతిని
నాలికతో కడిగేసాడు!

కుమ్మరికి
కుండ కరువు
తాపీమేస్ర్తీకి
గూడు అరువు!

కాకినాడ కాజా
తాపేశ్వరం మడత కాజా
కోనసీమ పూతరేకులు
తూర్పు పట్టు తేనెలు!

బాల్యం కోలార్ గని
ముడి ‘పసి’డిని
శ్రద్ధపెట్టి శుద్ధిచేస్తే
భవిష్యత్తు బ్రహ్మాండం!

పాక్ చైనాలు
కయ్యానికి వియ్యానికి
పనికిరాని
అయోగ్య దేశాలు!

సవ్యసాచి
అన్నదాతకి గురువా?
రెండు చేతులతో
పంట పండిస్తాడు!
*

-మాధవరపు కృష్ణ 8985492283