S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వందేమాతరం

సిరులు పండిన నేలతల్లి
పాడిపంటల కల్పవల్లి
స్వేచ్ఛ లేక కుములుతుంటే
ప్రాణాలే తృణప్రాయంగా
ఏకతాటిపై నిలిచి పోరాడిన
అమరవీరుల గుండె ఘోషే
వందేమాతరం.

బానిసత్వపు బందీ నుండి
భరత జాతిని మేల్కొపుతూ
వరదలా పొంగిన స్వాతంత్య్ర కాంక్షే
వందేమాతరం.

వర్ణమేదైనా వర్గమేదైనా
ఒకే గూటి గువ్వలమంటూ
కోట్లాది భారతీయ గుండెలు పలికే
ఆత్మీయ గీతమే
వందేమాతరం.

స్వేచ్ఛా వాయువుల ప్రవాహంలో
సగర్వంగా రెపరెపలాడిన
మువ్వనె్నల జెండా
ఆనంద తాండవమే
వందేమాతరం.

తరాలు మారినా యుగాలు మారినా
మన భరతావనిలో అణువణువు వినిపించే
అమృత గానమే
వందేమాతరం.

-వి.పద్మకుమారి