S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఈ క్షురకుడి స్టైలే వేరు(లోకం పోకడ)

చే సే పనిని ప్రేమించాలి. ఆ పని చేయడానికి తపించాలి. అప్పుడే చేస్తున్న పనిలో అనూహ్య ఫలితాలు వస్తాయి. అలా చేసే పనితోనే ఎనలేని కీర్తిప్రతిష్టలు సొంతమవుతాయి. వారణాసిలోని జగత్‌గంజ్‌కి చెందిన అన్సర్ అహ్మద్ కూడా తాను చేసే పనిని ఎవరూ ఊహించని విధంగా చేస్తూ ఎల్లలెరుగని పేరు తెచ్చుకున్నాడు.

క్షురక వృత్తి చేసే అన్సర్ అహ్మద్ చిత్రవిచిత్రమైన రీతిలో ఆ పని చేస్తూ చూపరులను ఆశ్చర్యంలో ముంచెత్తుతూ ఉంటాడు. నిజానికి అన్సర్ అహ్మద్ తొలుత రెండు చేతులతోనే జుత్తు కత్తిరించేవాడు. అయితే దురదృష్టవశాత్తు 2001లో అతనికి యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్‌లో అతని ఒక చేతికి గాయమైంది. కొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఇల్లు గడవడానికి పని చేయక తప్పదు కాబట్టి బాగున్న ఒక చేత్తోనే జుత్తు కత్తిరించేందుకు సిద్ధమయ్యాడు. మంచి క్షురకుడిగా పేరున్న అన్సర్ అహ్మద్‌కి సహజంగానే కస్టమర్లు ఎక్కువగా ఉండేవారు. అతనికి ప్రమాదం జరిగి ఒక చేత్తోనే జుత్తు కత్తిరిస్తున్నా వారంతా అతని దగ్గరకే వచ్చేవారు. చిన్నతనం నుండి క్షురక వృత్తి తప్ప మరే వృత్తి రాని అన్సర్ అహ్మద్ కష్టమైనా ఆ పనే చేస్తూ వచ్చాడు. ఒక చేత్తో జుత్తు కత్తిరిస్తూ ఒక్కొక్కసారి నోటితో కూడా ఆ పని చేస్తూ యాక్సిడెంట్ జరగకముందు ఎలా అయితే కచ్చితంగా జుత్తు కత్తిరించేవాడో అలాగే ఇప్పుడూ కత్తిరిస్తూ కస్టమర్లను సంతృప్తిపరచసాగాడు. అలా కొన్ని మాసాలు గడిచేసరికి నోటితో జుత్తు కత్తిరించడం కూడా అతనికి అలవోక విద్య అయిపోయింది. ఇది పాత కస్టమర్లతో పాటు కొత్త కస్టమర్లను, టూరిస్టు ప్రాంతం అయిన వారణాసికి వచ్చే సందర్శకులను కూడా విశేషంగా ఆకర్షించడంతో అతని సెలూన్‌కి వచ్చే వారి సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయింది.
తన టాలెంట్‌ని ప్రపంచానికి చాటి చెప్పే పనిలో భాగంగా అన్సర్ అహ్మద్ 24 గంటల పాటు ఆగకుండా ఏకధాటిగా నోటితో జుత్తు కత్తిరించడం ద్వారా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కేందుకు 3 మార్చి 2016లో అతి పెద్ద ఫీట్ చేసాడు. ఆ సమయంలో దేశ విదేశాలకు చెందిన వారంతా ఆయనతో తమ జుత్తు కత్తిరింపజేసుకున్నారు. ఆ సమయంలో ఒక్క కస్టమర్ వద్ద కూడా డబ్బులు తీసుకోలేదు అన్సర్ అహ్మద్. ఈ విధంగా గిన్నిస్ రికార్డ్స్‌కు ఎంట్రీ పంపిన అన్సర్ అహ్మద్ తన నైపుణ్యాన్ని తనలోనే దాచేసుకోవాలని అనుకోవడం లేదు. శారీరక వైకల్యంతో ఎలాంటి ఉపాధికి నోచుకోని యువకులకు నేర్పడం ద్వారా వారు భృతి పొందేందుకు సాయపడుతున్నాడు. ఆ పనిలో భాగంగా తాను నివసించే ప్రాంతానికి చెందిన దివ్యాంగులు కొందరిని ఎంపిక చేసి వారికి తర్ఫీదునివ్వడం అప్పుడే మొదలుపెట్టేశాడు. 2001లో తనకి యాక్సిడెంట్ అయినప్పుడు కొన్ని రోజుల పాటు పని లేక తన కుటుంబం విలవిల్లాడినప్పుడే ఆకలి బాధ తనకి తెలిసిందని, అందుకే ఏ పనీ చేయలేని దివ్యాంగులకు తన వృత్తిలోని మెళకువలను బోధిస్తున్నట్లు అన్సర్ అహ్మద్ తెలిపాడు.
*

- దుర్గాప్రసాద్ సర్కార్