S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పసికందులకు స్విమ్మింగ్ పాఠాలు!

పసికందులకు స్నానం చేయించడానికే చాలామంది భయపడుతూంటారు. అలాంటి ఈజిప్టులోని కైరో నగరంలో పసికందులకు ఈతలో పాఠాలు నేర్పించే స్కూల్ ఒకటి ఈ మధ్య ప్రారంభమైంది. దానికి మంచి ఆదరణ కూడా లభిస్తోంది. మూడు నెలల నుంచి ఏడు నెలల మధ్య వయస్సున్న పిల్లలకు మాత్రమే ఇందులో ప్రవేశం. తల్లిదండ్రులు దగ్గరుండి వారికి ఈత నేర్పవచ్చు. ఎలా నేర్పించాలో వారికి ఓ ట్రైనర్ తర్ఫీదు ఇస్తాడు. వైద్య, ఇతర సౌకర్యాల మధ్య ఈ స్కూల్ ఈతలో పిల్లలకు మంచి శిక్షణ ఇస్తోంది. రష్యాలో శిక్షణ పొందిన ముప్ఫై ఏళ్ల మహమ్మద్ అబ్దుల్ మక్సౌద్ కైరోకు వచ్చి ఈ శిక్షణ సంస్థను ప్రారంభించాడు. నెలల వయస్సున్న పిల్లలను నేరుగా పూల్‌లోకి అనుమతించరు. ఒకటి రెండు రోజులు నీటితొట్టెల్లోనే వారి కాళ్లు, చేతులు, ఆ తరువాత నడుం ఉంచి నీరంటే భయం లేని విధంగా తర్ఫీదు ఇస్తారు. నీళ్లలో ఉన్నప్పుడు 27 సెకండ్లపాటు పిల్లలు నీళ్లు తాగకుండా ఉండగలరు. ఆ విషయాన్ని గుర్తించి తగిన విధంగా శిక్షణ ఇస్తారు. కైరోలో ఇలాంటి సంస్థ ప్రారంభమవడం ఇదే ప్రథమం.

- భారతి