S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఐస్‌‘క్రీము ఎప్పుడు తినాలి? (మీకు మీరే డాక్టర్)

ఫ్రశ్న: విందు భోజనానికి వెళ్లినప్పుడు, హోటళ్లలో భోజనం చేసినప్పుడు, ఐస్‌క్రీం తప్పనిసరిగా వడ్డిస్తారు. విడిగా కూడా ఐస్ చూస్తే ఐసై పోతూంటారు మనలో చాలామంది. ఈ ఐస్‌క్రీం అతిగా తింటే దంత వ్యాధుల్లాంటి సమస్యలు వస్తాయని అందరికీ తెలుసు. నా ప్రశ్న ఏమిటంటే, ఐస్‌క్రీంని ఎప్పుడు తినాలి? దయచేసి వివరంగా చెప్పగలరు.
జ: విందు భోజనాలకు వెళ్లినా, హోటళ్లకు వెళ్లినా భోజనం చివర ఐస్‌క్రీం ఇస్తారు. ఋగ్వేదంలో చెప్పిన రూలన్నంతగా పెరుగు అన్నం తిని పాలతో తయారైన ఐస్‌క్రీంని మనం తింటున్నాం. ఇలా తినవచ్చా అనే ప్రశ్న చాలామంది వేసుకోవటం లేదు.
పెరుగు లేదా మజ్జిగ తీసుకున్నాక పాలకు సంబంధించిన ఏ పదార్థం తీసుకున్నా కడుపులోకి వెళ్లి అది విరిగిపోయి అపకారం చేస్తుంది. ఐస్‌క్రీం మాత్రమే కాదు, పులుసన్నమో సాంబారన్నమో తిన్నాక పాయసం, బాసుంతి లాంటి పాల పదార్థాలు తిన్నా చెడే జరుగుతుంది. సాంబారిడ్లీ తిని కాఫీ లేదా టీ తాగినా విష దోషమే అవుతుంది.
బొల్లి, ఎగ్జిమా, దగ్గు, జలుబు, తుమ్ములూ, ఆయాసం లాంటి ఎలర్జీ వ్యాధులు ఎందుకొస్తున్నాయో ఒక పట్టాన నిర్థారించటం కష్టం. ఇది ఎలర్జీ వ్యాధి. సరిపడని వస్తువుల్ని చూసుకుని తినండి. జాగ్రత్తగా ఉండండి.. అని మాత్రమే వైద్యులు చెప్పగలుగుతారు. ఇలాంటి వ్యాధులు పుట్టడానికి ఇవిగో ఇలాంటి చిన్నచిన్న తప్పులే దారి తీస్తుంటాయి.
ఒకదానికొకటి విరుద్ధంగా ఉండేవి ఒకేసారి తినవద్దనే చిన్న సూచనని పట్టించుకున్నందువల్ల పెద్ద అపకారాల్లోంచి బయట పడగలుగుతాం.
పరస్పర విరుద్ధ పదార్థాలను కలిపి తింటే కడుపులో incompatibility ఏర్పడుతుంది. అలాంటి విరుద్ధ పదార్థాల్ని Unwholesome die అంటారు.
ఆహార పదార్థాలు గానీ, మందులు గానీ తీసుకున్నాక వాటి ప్రభావం శరీరం మీద ఏ విధంగా ఉంటుందనే అధ్యయనాన్ని in - vitro in -vivo correlation (IVIVC) అంటారు. విరుద్ధ పదార్థాలు కలిసినప్పుడు పాల వలన కలగవలసిన గుణాలు, పెరుగు వలన కలగవలసిన గుణాలూ కడుపులో విరుద్ధంగా రసాయన చర్యలు పొందుతాయి. అందువలన విష దోషాలు ఏర్పడతాయి.
ఈ కారణం చేతనే రెండు మూడు రకాల కాంబినేషన్లలో మందుల తయారీని నిషేధించారు. కలపకుండా తినవలసిన వాటి మీద అధ్యయనం జరగాల్సి ఉంది. పాలతో గానీ, పెరుగుతో గానీ ఒక ఐటమ్‌ని తిన్న తరువాత దానికి విరుద్ధం కాని వేరే ఆహార పదార్థం తిన్నాక అప్పుడు ఆ విరుద్ధ పదార్థాన్ని తినవచ్చు.
విందు భోజనాలకు వెళ్లినప్పుడు చివరి ఐటమ్‌గా కాకుండా ముందుగానే ఐస్‌క్రీం తిన్నామనుకోండి.. మనల్ని అనాగరికులుగా చూస్తారనే బెరుకు ఉంటుంది మనకి. అందుకని, పెరుగన్నం తిన్నాక పాలతో తయారైనది కాని ఏదైనా స్వీటు తినండి. పులుపు లేని అరటి, యాపిల్, బొప్పాయి లాంటి పండు తినండి. అప్పుడు ఐస్‌క్రీం తింటే ఎలాంటి ఇబ్బందీ ఉండదు.
భోజనంలో మొదట కూరపప్పు తినండి. స్వీటు ఆఖర్న తినండి. వడ్డించే వాళ్లు ముందే వడ్డించినంత మాత్రాన మనం ముందే స్వీటు తినాలని అనుకోకూడదు. భోజనాంతే మదు రసం అనేది సూత్రం. భోజనం చివర మాత్రమే స్వీటు తినాలి! స్వీటు తిన్నాక ఐస్‌‘క్రీం తినండి!
*
సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్తు, బకింగ్‌హామ్‌పేట
పోస్టాఫీసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ - 500 002

- డా. జి.వి.పూర్ణచందు సెల్ : 9440172642 purnachandgv@gmail.com