S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

స్టోన్‌ఫిష్ కాటేస్తే..

విషపూరితమైన జీవి స్టోన్ ఫిష్. రాయిమాదిరిగా కనిపించడం వల్ల దానికి ఆ పేరు వచ్చింది. హిందూ పసిఫిక్ సముద్ర జలాల్లో ఇవి కనిపిస్తాయి. శరీరంపై ఉండే సూదుల్లాంటి పుల్లల దిగువ సంచుల్లో విషం నిల్వ ఉంటుంది. దీనిపై అడుగువేసినప్పుడు కలిగే ఒత్తిడిని బట్టి ఆ స్పైన్స్‌లోకి విషం వస్తుంది. కేవలం 0.15 సెకండ్లలో ఇది దాడి చేస్తుంది. కనురెప్ప పడి తెరిచేలోగా ఇది ఆహారాన్ని పట్టుకోవడం కాని, దాడి చేయడం గాని చేసేస్తుంది. దీనిమీద ఎంత ఎక్కువ వత్తిడి పడితే అంత ఎక్కువ విషం ఆ ముల్లుద్వారా శత్రువుశరీరంలోకి వెళుతుందన్నమాట. ఒకసారి ఆ ముల్లు దిగువ ఉన్న సంచీలోని విషం పూర్తయితే మళ్లీ రెండువారాల్లోగా ఉత్పత్తి అవుతుంది. మిగతా చేపలకు భిన్నంగా వీటికి ఓ లక్షణం ఉంది. నీటిని ఉమ్మగలగడం వీటి ప్రత్యేకత. అలాగే నీళ్లలో లేకుండా 24 గంటలపాటు ఇది జీవించగలుగుతుంది.

- ఎస్.కె.కె. రవళి