S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పెంపకం

ఇందిరాపార్క్‌లో కొన్ని గమ్మతె్తైన దృశ్యాలు కన్పిస్తూ ఉంటాయి. పావురాలకి ఆహార ధాన్యాలు వేస్తూ కొంతమంది కన్పిస్తూ ఉంటారు. అక్కడ వున్న చిన్న చెరువులో చేపలకి బ్రెడ్ ముక్కలు వేస్తూ మరి కొందరు కన్పిస్తూ ఉంటారు. మరి కొందరు చెట్టు మొదళ్లలో చిన్నచిన్న పురుగుల కోసం, చీమల కోసం పిండిని వేస్తూ కన్పిస్తూ ఉంటారు.
వీళ్లని చూస్తున్నప్పుడల్లా నాకు మా చిన్నప్పుడు మా అమ్మకి, మల్లయ్యకి జరిగిన ఓ సంభాషణ గుర్తుకొస్తుంది.
మా ఇంటి వెనుక చిన్న పెరడు వుండేది. అక్కడ చిన్న చెట్లను పెట్టి, వాటికి అవసరమైన దానికన్నా ఎక్కువ ఎరువులని వేయించేది మా అమ్మ. నీళ్లు కూడా ఎక్కువగా పట్టేది. అయినా అవి ఎక్కువకాలం బతికేవి కావు. చిన్న వానకే వాటి వ్రేళ్లు బయటకి వచ్చేవి. అది చూసి మా అమ్మ బాగా నిరుత్సాహపడేది.
చివరికి ఓ రోజు మా మల్లయ్యతో ఈ విషయం గురించి అడిగింది. అప్పుడు మా మల్లయ్య చాలా గమ్మతె్తైన సమాధానం చెప్పాడు. అది గమ్మత్తుకన్నా చాలా తెలివిగా చెప్పినట్టు అన్పించింది.
‘మనం ఈ మొక్కలకి అవసరమైన వాటికన్నా ఎరువులని, నీళ్లను ఎక్కువగా ఇస్తున్నాం. అందుకని అవి భూమి లోపలికి తమ వ్రేళ్లని పంపించడం లేదు. చిన్న గాలికే, చిన్న వర్షానికే అవి పడిపోతున్నాయి. వాటి వ్రేళ్లు బయటకు వస్తున్నాయి. ఇంత అవసరం లేదమ్మా’ మా అమ్మ ఏమీ మాట్లాడలేదు.
నా చిన్నప్పుడు ఆ మాటలలోని పరమార్థం అర్థం కాలేదు. కానీ పెద్దగా అయిన తరువాత ఆ విషయం చాలా బోధపడింది. పిల్లలని పెంచే క్రమంలో ఆ విషయం చాలా స్పష్టమైంది. మన పిల్లలకి అవసరమైన వాటిని ఎక్కువగా మనమే అందిస్తున్నాం. వాళ్లు ఏ మాత్రం శ్రమకు లోనుకాకుండా అన్నీ మనమే ఇస్తున్నాము. దానివల్ల వాళ్లు అన్నింటికి మనపైన ఆధారపడుతున్నారు.
మన జీవితానికి ఆ సంఘటనని బాగా అన్వయించుకోవచ్చు.
ఎవరికైనా కొంత సహాయాన్ని అందించవచ్చు. మన పిల్లలకి కొంత సహకారాన్ని అందించవచ్చు. అంతే కానీ అంతా మనమే అయి చేయకూడదు. వాళ్లకి వాళ్లు ఎదగడానికి అవకాశం కల్పించాలి. మన ప్రేమతో వాళ్లని పరాన్న జీవులని చేయకూడదు.
మా మల్లయ్య చెప్పిన విషయం ఆ కాలంకన్నా ఇప్పుడు ఎక్కువగా అన్వయించాల్సి ఉంటుందని అన్పిస్తుంది.
ఇందిరాపార్కులో పాదచారులు చేస్తున్న పని కూడా సమంజసంగా అన్పించడం లేదు. జీవన వైవిధ్యానికి దోహదం చేసే విధంగా వాళ్ల పని లేదని అన్పిస్తుంది.

జింబో 94404 83001