కామిక్ పండుగ
Published Tuesday, 5 September 2017లండన్లో ఏటా జరిగే సూపర్ కామిక్ షో అదిరిపోయింది. వివిధ కార్టూన్ కార్యక్రమాలు, కామిక్ పుస్తకాలు, షోలలో ప్రజాదరణ పొందిన పాత్రల మాదిరిగా వేషధారణలు, అలంకరణలు చేసుకుని హాజరయ్యే ఔత్సాహికులకు ఇది ఓ అద్భుతమైన పండుగ. చిన్నాపెద్దా ముసలీముతకా ఎవరైనా తన ఇష్టమైన కామిక్ పాత్ర వేషధారణలో పాల్గొనవచ్చు. నిర్ణీత రుసుము చెల్లించి ఇందులో పాల్గొనవచ్చు. ప్రధాన నిబంధల్లా ఏమిటంటే. తమ కాస్ట్యూమ్ లేదా అలంకరణలు, ఇతర అమరికల వల్ల మిగతా పోటీదారులకు, నిర్వాహకులకు, ప్రేక్షకులకు ఎటువంటి ప్రమాదం జరగకూడదంతే. ఆయా పాత్రధారులు వేసుకునే దుస్తులకూ నిర్ణీత కొలత ఉంటుంది మరి. ఇదిగో ఈ సూపర్ కామిక్ షోకు హాజరైన కామిక్ పాత్రల వేషధారులను చూడండి.