S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నా తెలుగు

తేనెకన్న తియ్యని అమృతభాష నాది
ఆంధ్రులకు ఉత్తేజాన్నిచ్చే
ప్రకృతిపర ప్రాచీన తెలుగు భాష నాది
తెలుగు పదం పలికితే అధరం మధురం
తెలుగు పాట పాడితే వదన వికసితం!
తెలుగు అక్షరాలెప్పుడూ వెలుగుల్ని వెదజల్లు
తెలుగు భాష నిత్యం అవనిలో విరజిల్లు
చేయెత్తి జైకొట్టు తెలుగు
గతమెంత ఘనకీర్తిగల తెలుగు నాది
నా శ్వాస - నా అణువణువూ తెలుగే!!
చిమ్మచీకటి పారద్రోలే వెలుగు నా తెలుగు
కవుల అక్షర పాత్ర నా తెలుగు
నా నేల... నా నిశ్వాస తెలుగు!!
కాబట్టి!!
మనమంతా మమేకమై
మన తెలుగు తరిగిపోకుండా
వెలుగు ఆరిపోకుండా
ప్రదీప్తం చేద్దాం
తెలుగును బ్రతికించడానికి
అవసరమైతే చావనైనా చద్దాం
తెలుగు అక్షరాలే ఆయుధాలుగా
తెలుగు వెలుగు దివిటీ వెలిగిద్దాం
తెలుగు వికాసానికై శ్రమిద్దాం
తేనెసోన మన తెలుగని నిరూపిద్దాం!!

-మహ్మద్ రఫీ 7893451307