S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అమ్మకానికీ నమ్మకం

ఇప్పుడు
నమ్మించడమే జీవితం
నమ్మకం కాదు
కానితనపు రక్తాన్ని
నరాలూ తిరస్కరిస్తున్నప్పుడు
మనసు నవనతం చేసుకుంటే తప్పేంటి
తలెత్తుకునే కదా బతకడం
విశ్వాసాన్ని శ్వాసిస్తానంటే ఎలా
ఊపిరి అందని ద్రాక్షౌతుంది
అసలు అలల్ని అరెస్టు చెయ్యాలి
పయనానికి పడిలేవడాలు నేర్పినందుకు
గమ్యాలు చేరేది అలలు కాదు కలలు
మూతపడటం లేదంటూ
కళ్ళనెందుకూ నిందించటం
రెప్పవాలని రోజులూ ఆల్బమ్‌లై తీరుతాయి
విడిచి నిలిచే ప్రతి క్షణమూ
అరచేతిలో ఆశ్రయమివ్వడమెందుకు
ప్రాణానికి కాసిన్ని నవ్వుల్ని వొదిల్తేసరి
పుణ్యానే్న కొనుక్కోవటానికి కలవాడు పడలా
విలువలు దొరకవా విపణిలో
అంతరాత్మనంటిపెట్టుకున్నంత వరకే ప్రబోధాలు
వీడాక అన్నీ ప్రలోభాలే
నోటికీ నొసటికీ పొసగనప్పుడు
పరిహాసాలే పరిపాటౌతాయి
నటరాజు నావాహన చేసుకుంటేనే
రాణింపు రాజయ్యేది

-కోన శ్యాంప్రసాద్