S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గళం విప్పండి

కదలి రండి కలసి రండి
తరతరాల చరిత వున్న
తెలుగు భాష కాపాడ!
తెగువజూపి ఉరకండి!!

ప్రాచీనత హోదా వున్న
ప్రపంచాన ప్రసిద్ధైన
అధికమంది పలుకాడె
తెలుగు భాష కాపాడ!
కదలి రండి కలసి రండి
తెలుగు భాష కాపాడ!!

నన్నయ్య పద్యమై
అన్నమయ్య పదములై!
త్యాగయ్య కీర్తనలై
క్షేత్రయ్య మువ్వగోపాలమై!
ప్రబంధ జడి కురిసి
అష్టదిగ్గజ ఝరిలాగ!
కదలి రండి కలసి రండి
తెలుగు భాష కాపాడ!

నీ భాషలేని నాడు
నువ్వుండి ఫలములేదు!
నీ భాషలేని నాడు
నీ మనుగడ నిలువలేదు!
నీ భాషలేని నాడు
నీ బతుకుకు విలువలేదు!
కదలి రండి కలసి రండి
తెలుగు భాష కాపాడ!

గళమెత్తి ఉరకాలి
తెలుగు భాష నిలుపాలి!
భావి భారతములోన
మన చరితలు పొగడాలి!
ఏ దేశమేగినా ఏ భాష నేర్చినా
తెలుగు భాష మనదంటు
తెగువజూపి పలకాలి!!
*

-రానాశ్రీ