S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అడవిలోని సింహం (సండేగీత)

ఈమధ్య ఓ సింహం కథ చదివాను. కథ చాలా బాగుంది. ‘్ఫ్లంచ్’ అన్న నవలలోని ఓ చిన్న కథ అది.
రెండు సింహాల కథ. ఓ సింహం అడవిలో ఉంటుంది. మరో సింహం ‘జూ’లో ఉంటుంది. రెండూ సింహాలే. కానీ రెండింటి జీవితం వేరువేరుగా ఉంటుంది.
అడవిలో వుండే సింహం ఉదయం లేస్తుంది. ఆ ఉదయం అది ఏమి భుజిస్తుందో దానికి తెలియదు. లేచిన తరువాత వేటకు వెళ్తుంది. ఏ జంతువు దొరికితే దాన్ని వేటాడి భుజిస్తుంది. ఆ ఆహారం గురించి అది ఆలోచించదు. వేచి చూడదు. అవసరం అన్పించగానే వేటకు వెళ్తుంది అంతే!
కానీ జంతు ప్రదర్శనశాలలో వుండే సింహం పరిస్థితి మరోలా వుంటుంది. ఎందుకంటే అది బందీ. అది ప్రతిరోజూ తనకు ఆహారం తెచ్చి యిచ్చే వ్యక్తి కోసం ఎదురుచూస్తూ ఉంటుంది.
ఈ సింహానికి, అడవిలోని సింహానికి భేదం ఉంది. అడవిలోని సింహం ఆహారం కోసం పరుగెత్తాలి. జూ లో వున్న సింహం మాదిరిగా రిలాక్స్‌డ్‌గా అది ఉండలేదు. జూ లోని సింహం మాదిరిగా ఆహారం గురించి వేచి ఉండదు. ఆహారం కోసం ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఎలాంటి బాధ లేకుండా జూ లోని సింహం ఉంటుంది. కానీ అడవిలోని సింహం పరిస్థితి వేరు.
రెండూ సింహాలే!
కానీ
రెండింటి జీవితాలు వేరు.
సింహాలని అడవికి రాజుగా పరిగణిస్తాం. ఈ రెండు సింహాల్లో అడవిలో వున్న సింహానే్న రాజుగా చూస్తాం. అది రాజుగా ప్రవర్తిస్తుంది. రెండో సింహం చాలా సౌకర్యంగా ఉంటుంది. కానీ అది రాజుగా పరిగణించబడదు.
మనకు కూడా ఈ కథ పూర్తిగా వర్తిస్తుంది. అడవిలోని సింహం మాదిరిగా బతుకుదామా లేక జూ లోని సింహం లాగా ఉందామా?
సౌకర్యంగా తల్లిదండ్రుల చాటున్నో లేక వాళ్ల ఆస్తి మీదనో బ్రతుకుదామా? లేక జీవన సంగ్రామంలో పోరాటం చేస్తూ బ్రతుకుదామా?
నిర్ణయం తీసుకోవాల్సింది మనమే!
అడవిలోని సింహానికి వుండే గౌరవం వేరు. దాని జీవన శైలి వేరు. దాని చైతన్యం వేరు.
మనం అడవిలోని సింహంలా బతకాలి. ధైర్యంతో, ప్రమాదాలతో, తెగింపుతో బతకాలి.
ఒక్కమాటలో చెప్పాలంటే రాజులా బతకాలి.

జింబో 94404 83001