నానీలు
Published Sunday, 17 September 2017ఖురాను, గీతా, బైబిల్
అన్నీ ఒకటే
మానవ జీవితానికి
చూపే బాటే
అవిటితనానికి
జాలి సరిపోదు
చేయూతకు
మించింది లేదు
మనిషి జీవితాన్ని
నిత్యం కరిగించే
ద్రవ పదార్థమే
మద్యం
దక్షిణ లేకపోతే
పూజారి శఠగోపం
అధికారి ఫైలూ
కదలదు
అమెరికాలో
తెలుగుకు వెలుగు
ఆంధ్రాలో
చీకటిలో తెలుగు
గునపాలతో
గోతులు త్రవ్వినా
ఎదురుతిరగని తల్లి
భూమాత
అలసిన శరీరానికి
ఆసరా చెట్టు
మాత్రమేనా
అమ్మ కూడా
దోమల దండకాలు
విన్పిస్తున్నాయి
దారిలో
ధర్మాసుపత్రి ఉంది మరి
పిండంలో ఆడపిల్ల
అని తెలిస్తే గండం
కడుపులోనే
అశ్రుభాండం
సాహితీ ప్రియులు
చర్చించుకుంటున్నారు
తెలుగుకు తెగులు
సోకిందని.