స్నేహము-బంధము
Published Saturday, 23 September 2017స్నేహబంధము చెరిగిపోనిది
చిన్ననాటి చిలిపిచేష్టలు మరిచిపోనివి
బడిలోని గురువులు నేర్పిన విద్య సూత్రాలు మరిచిపోనివి
స్నేహితుల జ్ఞాపకాలలాగ అవి మరపురానివి
ఇసుకలోన దిద్దించిన అక్షరాలు
అవియే మానవ జీవన బీజాక్షరాలు
గురువులు నేర్పిన గుణగణాలు స్నేహ బంధాల నిర్వచనాలు
ఇదే చివరిసారిగ నిలిచేది
ఇందుగల బలం ఎందునా లేదు
గురువుల దీవెనలే స్నేహితుల భావాలు
స్నేహ బంధం - పెదవి పైన విరిసిన చిరునవ్వు
మాసిపోని, చెరిగిపోని నిశ్చల ముత్యపుచిప్పల
కాంతి రేఖలే స్నేహ బంధాలు