ఆకలి
Published Saturday, 23 September 2017ఆకలికి లేదు మతం
ఆకలికి లేదు కులం
ఆకలి మతమే మానవత్వం
ఆకలి గుణమే సమానత్వం
ఆకలి తీర్చిన వాడికి
సిద్ధించు దైవత్వం
ఇది అందరూ తెలుసుకోవాల్సిన
అమృతతత్వం
* * *
హృదయం
నీ హృదయం కుసుమం
నీ మనసు సుకుమారం
కఠిన పాషాణాలకేమి తెలుసు
కుసుమాల సుకుమారత్వం
నేటి సమాజంలో
మానవతా విలువలు శూన్యం
ధనం చుట్టూ, దర్పం చుట్టూ
తిరుగుతున్న విషపు నాగులు
కాలమే యివ్వాలి తీర్పు
మనుషులలో రావాలి మార్పు.
*