S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మీ ఆయుష్షు మీ చేతిలోనే ఉంది!

కొవ్వొత్తి రెండు వైపులా మండితే వేగంగా అది కాలిపోతుంది. ఈ రోజున పెక్కుమంది యువత ఈ విధంగానే పనిచేస్తూ తమ ఆయుష్షును తగ్గించేసుకుంటున్నారు. ఒక గొప్ప విషయం ఏమిటంటే వైద్య శాస్త్రం పుణ్యమా అని మనిషి సగటు ఆయుష్షు పూర్వీకుల కంటే పెరిగింది.
సైన్సు పరిశోధనలలో ఒక సంగతి వెలుగులోకి వచ్చింది. ప్రతి సంవత్సరంలోను కేలండర్ చూపించే సంవత్సరంలో మనం కొంత సమయాన్ని మాత్రమే ఉపయోగించుకుంటున్నాము. అంటే ఈ ఆధునిక స్పీడు యుగంలో కూడా ఎవరూ కొవ్వొత్తిని రెండువైపులా వెలిగించుకోవడం లేదన్నమాట. ఇప్పుడు మానవుని సగటు ఆయుష్షు 70 సంవత్సరాలు అంటున్నారు. అందుకే మీరు అనుకున్నట్లు కాకుండా మీ ఆయుష్షు మరింత ఎక్కువగా ఉంటుంది.
శాస్తవ్రేత్తలు మనిషి ఆయుష్షు గురించి చక్కని వివరణ ఇస్తున్నారు. మీరు 50 సంవత్సరాల వయసులో ఉంటే మరొక 22 సంవత్సరాలు మీ ఆయుష్షు పెంచుకోవడం మీ చేతిలో ఉంటుందంటున్నారు. మీకు 60 సంవత్సరాలుంటే మరొక 14 సంవత్సరాలు మీ ఆయుష్షు పెంచుకోవచ్చు. 70 సంవత్సరాలయితే 9 ఏళ్లు మీరు పెంచుకోగలరు. మీకు 80 ఏళ్లయితే మరొక 5 ఏళ్లు పెంచుకోవచ్చు అని చెబుతున్నారు.
వయసు పెరిగే కొలది మనిషికి ముసలితనం మీద పడుతూ ఉంటుంది. గతంలో మనుషుల్ని తుడిచిపెట్టేసే రోగాలకు ఇప్పుడు వైద్య పరిశోధనలు కొత్తకొత్త మందుల్ని అందుబాటులోకి తెచ్చాయి. ఇంకా తెస్తున్నాయి.
20 ఏళ్లకే ఒకప్పుడు పెద్ద వయసు
15వ శతాబ్దంలో కొత్తగా జన్మించిన శిశువు 20 ఏళ్లు బ్రతికితే చాలనే స్థితి ఉండేది. అప్పట్లో అదే పెద్ద వయసు. నత్తనడకలా కొనసాగుతూ శతాబ్దాలు గడిచేసరికి మనిషి సగటు ఆయుష్షు ఏ విధంగా పెరిగిందో మనకు తెలుసు.
బైరన్ అనే కవి 36 ఏళ్లకే మరణించాడు. అతని కవితల్లో తాను ముసలివాడని ఆ వయసుకే రాసుకున్నాడు. 150 సంవత్సరాల క్రితం. ఈ 150 సంవత్సరాలలో 36 ఏళ్లు యువత వయసుగానే మారిపోయింది. ఇప్పుడు మనిషి 40 ఏళ్లలోపులో విజయం సాధిస్తే యువత సాధించిన విజయం అని చెప్పుకుంటున్నాం.
ఆయుష్షు ఎందుకు పెరిగింది?
మనిషి ఆయుష్షు పెరగడానికి ప్రధానంగా మూడు కారణాలు కన్పిస్తున్నాయి. మొదటిది బాల్య స్థితిలో ఎదురయ్యే ప్రమాదాలను తట్టుకుని బ్రతకడం చేతనయింది. రెండవది నడి వయసులో కలతలు లేని జీవితం జీవించడం నేర్చుకున్నాం. మూడవది అనేక పద్ధతులను పాటిస్తూ వయసు పెరుగుతున్నా ముసలితనం మీదకు దండయాత్ర చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. దీనికి మించి జీవన విధానంలో ఎన్నో అధునాతన సౌకర్యాలు మన ముంగిట అందుబాటులోకి వచ్చాయి.
ఇప్పుడు 60 ఏళ్ల వ్యక్తి గతంలో మాదిరిగా ఒంటరిగా జీవించే పరిస్థితులు లేవు. ఆ వయసులో కూడా సమాజంలో మిళితమై జీవించేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి.
వయసులో వున్నప్పుడు సాధించలేని విజయాలను అనుభవాల నుండి నేర్చుకున్న వివేకంతో 60 ఏళ్లు దాటినవారు విజేతలుగా దర్శనం ఇస్తున్నారు. తమాషా ఏమిటంటే ఇప్పుడు 70 ఏళ్ల మహిళ 85 సంవత్సరాల యువకుడిని పెళ్లాడిందనే వార్తలు ఎన్నో వింటున్నాము. పత్రికల్లో చదువుతున్నాం.
వృద్ధుల సంఖ్య పెరిగింది
ఇప్పుడు జనాభాలో వృద్ధుల శాతం బాగా పెరిగింది. కారణం వృద్ధులు తమ శరీర ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వైద్య విధానాలు పెద్ద వరంగా అందుబాటులో ఉన్నాయి. వృద్ధులకు సుఖ జీవనాన్ని ప్రసాదించగల నిపుణుడు వారి కుటుంబ వైద్యుడు మాత్రమే. మనిషి తన వృద్ధాప్యాన్ని వరంగా భావించి సుఖజీవనం గడిపితే వందేళ్లు దాటి జీవించగల్గుతాడు.
ఆయుష్షు పెంచుకోవడం ఎలా?
వృద్ధాప్యంలో భాగస్వామిని కోల్పోతే సరియైన భాగస్వామి లభిస్తే హాయిగా పెళ్లి చేసుకోవాలి. పెళ్లి గురించి ఇటువంటి వృద్ధులు ఆలోచించాలి. వయసు ముదిరిపోయింది వైవాహిక జీవితం గడపలేమనే ఆందోళన పడకూడదు. బంధువులు, కావలసిన వాళ్లు ‘ముసలాడివి నీకేమిటి మళ్లీ భోగం’ అనే మాటలు పట్టించుకోనవసరం లేదు. సైన్సు ప్రకారం జంటగా వున్నవారు ప్రశాంత జీవితం గడుపుతూ ఉంటే ఎక్కువకాలం జీవిస్తారు అంటున్నారు.
ముసలి వయసులో ‘ప్రేమ’ ఎంతో అందమైన అనుభూతుల్ని ఆనందాన్ని కలుగజేస్తుంది. సాధారణ ఆరోగ్యంగల వృద్ధులు తమ సంసార జీవితంలో ఎన్నో సంతోషాలను ఆవిష్కరించుగోగలరు.
రెండవ అంశం వృద్ధులు మంచి స్నేహితులను సంపాదించుకుంటే మానసికంగా ఎంతో ఉత్తేజిత స్థితిలో ఉండగల్గుతారు. ఎంతటి సంపదయినా ఈ స్నేహితుల సాన్నిహిత్యం ముందు తక్కువగానే ఉంటుంది.
ఎవరికీ వందల సంఖ్యలో స్నేహితులు అవసరం లేదు. నలుగురు అయిదుగురు మంచి స్నేహితులు ఉంటే చాలు. వారు సాధించే విజయాలకు అభినందనలు చెప్పడం, సమస్యల్లో ఇరుక్కున్నప్పుడు సానుభూతితోపాటు ఉపయోగపడే సలహాలు ఇవ్వడం వంటివి చేస్తూ ఉండాలి.
పాత స్నేహితుడు పరమపదిస్తే కొత్త స్నేహితుడిని వెతుక్కునే నైజం అలవరచుకోవాలి. కొత్తవారితో పరిచయాన్ని స్వాగతించినపుడే మానసికంగా పడుచుదనంలో ఉండగల్గుతారు. మన శరీరంలోని శుద్ధ రక్తనాళాలు (్ధమనులు) వయసు పెరుగుతుంటే గట్టిగా పెళుసుగా తయారవుతూ ఉంటాయి. వాటిని సక్రమంగా ఉంచుకునేందుకు ఇప్పుడు ఔషధాలు అందుబాటులో వున్నాయి. మీ మనసును మీ అధీనంలో ఉంచుకోవాలి. అది కూడా గట్టిపడి పెళుసుగా తయారవకుండా చూసుకోవడం మీ చేతులలోనే ఉంటుంది.

-సి.వి.సర్వేశ్వరశర్మ