S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

టమోటా కప్పల తెలివి తెలుసా!

టమోటా పండ్లలా ఎర్రగా, ఉబ్బిన పొట్టతో గుడ్రంగా కనిపించడం వల్ల ఈ కప్పలను టమోటా ఫ్రాగ్స్ అని పిలుస్తారు. మడగాస్కర్ దీవుల్లో మాత్రమే ఇవి కనిపిస్తాయి. సాధారణంగా పసుపు, ఎరుపు, ముదురు ఎరుపు రంగుల్లో ఇవి ఉంటాయి. రంగుల్లో మెరుపును బట్టి అవి ఎదిగే వయసు వచ్చిన విషయం తెలుస్తుంది. వీటిని శత్రువులు తినడానికి ప్రయత్నించినపుడు ఇవి పొట్టను ఉబ్బరించేలా చేసి గుండ్రంగా తయారవుతాయి. ఆ సమయంలో శరీరం నుంచి బంకలాంటి ఒక విష రసాయనాన్ని విడుదల చేస్తాయి. దీనివల్ల ఆ శత్రువు నోరు, కళ్లు మూసుకుపోయి ఊపిరితీయడం కష్టమవుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో కప్పను అది తినలేక కక్కేయవలసి వస్తుంది. అలా ప్రాణాలతో బయటపడటం దాని తెలివికి నిదర్శనం. ఈ జాతికప్పల్లో ఆడవి మగవాటికన్నా ఒకటి రెండు అంగుళాలు పెద్దవిగా ఉండటం విశేషం. ఈ కప్పలు భయపడినప్పుడు మాత్రమే ఈ విషరసాయనం విడుదలవుతుంది. ఇది మనుషులకుకూడా అలర్జీ వచ్చేలా చేస్తుంది.

- ఎస్.కె.కె. రవళి