S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఇది కొమ్మకాదు... పక్షి

ఎండిపోయి విరిగిన కొమ్మలా ఈ ఫొటోలో కనిపిస్తున్నది ఓ పక్షి. వీటిని ఫ్రాగ్‌వౌత్ పక్షులుగా పిలుస్తారు. వాటినోరు కప్పనోటిలా ఉండటం వల్ల ఆ పేరు వచ్చింది. చెట్ల బెరడు రంగులా వాటి వాటి ఈకలు బూడిద, గోధుమ రంగులో ఉంటాయి. చూడటానికి గుడ్లగూబల్లా ఉన్నప్పటికీ వాటితో వీటికి సంబంధం లేదు. తావీ ఫ్రాగ్‌వౌత్ పక్షులైతే ఎండిన చెట్ల బెరడు రంగులో విరిగిన కొమ్మల్లో కలసిపోయి ఉంటాయి. చూసి వెంటనే పోల్చుకోవడం కష్టం. ప్రమాదం ఎదురైనప్పుడు కదలకుండా అలా ఉండిపోవడం వాటి ప్రాణరక్షణ యత్నంలో ఒకటి. ఆస్ట్రేలియా, పపువా న్యూగినియా, టాస్మేనియాల్లో ఇవి కనిపిస్తాయి.

- ఎస్.కె.కె. రవళి