S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నౌకల్లో ఇలా పనిచేయాలి... (అవీ..ఇవీ)

విమానాల్లో ఎయిర్‌హోస్టెస్‌ల మాదిరిగా నౌకల్లోనూ ప్రయాణీకులకు ఉద్యోగులు ఆదరంగా సేవలు అందించాల్సి ఉంటుంది. అందుకోసం తగిన శిక్షణ అవసరం. రోజుల తరబడి కొనసాగే ప్రయాణంలో చికాకు, విసుగు కన్పించనీయకుండా ఆప్యాయంగా, చిరునవ్వుతో పలకరిస్తూ సేవలు అందించాల్సి ఉంటుంది. అందుకే చైనాలో ఓ ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కేవలం మహిళా ఉద్యోగులను మాత్రమే ఈ శిక్షణకు పిలుస్తున్నారు.

నిను వీడని నీడను నేనే...

అద్దంలో ప్రతిబింబం చూసుకోవడం అందరికీ అలవాటే. కానీ పశుపక్ష్యాదులకు అద్దాల అవసరం ఏముంది. ఇదిగో ఇక్కడ కన్పిస్తున్న చిత్రం చూడండి. మంచుదుప్పటిపై తన ప్రతిబింబాన్ని తేరిపార చూస్తున్న ఈ పక్షి అమితాసక్తిని గమనించండి. జర్మనీలోని హనోవర్‌లో మష్‌స్సీ సరస్సుపై మంచు పేరుకుపోయినప్పుడు వాలిన ఓ పక్షి ఇలా తదేకంగా తన ప్రతిబింబాన్ని పరిశీలించింది. ఆ అద్భుత దృశ్యాన్ని క్లిక్‌మన్పించాడు ఫొటోగ్రాఫర్ జులియన్ స్ట్రాటెనషుల్జ్.

అద్దాలవంతెనపై యోగా

ప్రకృతిని రక్షిస్తూ, దానిని ధ్వంసం చేయకుండా సామరస్యంగా జీవించాలన్న ఉద్దేశంతో నిర్వహించిన ప్రచార కార్యక్రమంకోసం ఇలా మహిళలు సామూహిక యోగా చేపట్టారు. చైనాలోని షినిఘాయ్ నేషనల్ జియోపార్క్‌లోని అద్దాల వంతెనపై వందమంది అందగత్తెలు ఇలా యోగా చేసారు.

సింహాల కోసం...

భూగోళంలో సింహాల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. సింహాలను రక్షించి, వాటి సంతతి పెరిగేలా ప్రజల్లో చైతన్యం తేవాలన్నది ఇప్పుడు ప్రపంచదేశాల లక్ష్యం. ప్రఖ్యాత నేషనల్ జియలాజికల్ (వైల్డ్) ఛానల్ ఆ కార్యక్రమంలో భాగస్వామ్యం పొందింది. లండన్‌లోని ప్రఖ్యాత ట్రఫాల్గర్ స్క్వేర్‌లో సింహపు లోహవిగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రజాచైతన్యంకోసం కృషి చేస్తోంది.

ముద్దూమురిపెం

కాకి పిల్ల కాకికి ముద్దు అంటారు. చింపాంజీ పిల్లకు తల్లి ముద్దు అని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. కాంగోలోని ఓ వైల్డ్‌లైఫ్ పార్క్‌లోని ల్ల చింపాంజీ (క్వెంటిన్)కి తల్లంటే తెగ ప్రేమ ముంచుకొచ్చింది. అందుకే ఎంచక్కా ఓ ముద్దు ఇచ్చింది. దాంతో తల్లి చింపాంజీ (జిన్) తెగముచ్చటపడిపోయింది.

-భారతి