నీతి సూత్రం
Published Saturday, 7 October 2017నీతిగల ప్రభుత్వాలు
కావాలనుంటే
నీతిగల ప్రజలు కావాలి!
వైద్యులు, న్యాయవాదులు
అహర్నిశలు
దేశం కోసం పరిశ్రమించాలి!
నాయకులు ప్రజల్ని
సొంత బిడ్డల్లా
చూసుకోవాలి!
వాతావరణ
పరిశుభ్రత కోసం
ప్రతివాడూ ఆలోచించాలి!
నేలతల్లిని
సొంత తల్లిని
గౌరవించాలి!
ఉపాధ్యాయుడిని
రాష్టప్రతిలా
చూసుకోవాలి!