S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వర్షమూ - పిల్లలు

వానాకాలం పిల్లలంతా
సంతోషం పండుగవుతారు

మబ్బులు కమ్మినప్పుడల్లా
వర్షం తేనెపట్టు కోసం
ఆకాశం చెట్టు వంక చూస్తారు

ఉరుములు మెరుపులు ఊరిస్తోంటే
చినుకుపూల స్పర్శ కోసం
చిగురాకు దోసిళ్లవుతుంటారు

వర్షంలో తడువచ్చనీ..
ఇంటి పక్క నీటి గుంటల్లో
కాగితప్పడవలేసి ఆడొచ్చనీ...
వాళ్లకు ఊహలు పుట్టుకొస్తాయి

పక్షులు వీపు మీద
మేఘాల్ని అతికించుకుని
స్వేచ్ఛగా తిరుగుతుంటాయి

సీతాకోక చిలుకలు
వర్షం వాసన పసిగట్టి
వలయాలుగా తిరుగుతుంటాయి

పుస్తకాల రెక్కలు తొడుక్కుని
వర్షం కురిసే చోటల్లా తిరగాలని
పిల్లల మనసు పిట్ట
ఫికరు కుర్సీ ఎక్కి అలుగుతుంది

ఎటొచ్చీ మనమే
తడిస్తే జ్వరమొస్తుందని
భయం గుంజకు పశువుల్లా కట్టేసి
పెత్తనం ములుగర్ర తిప్పుతుంటాం

వర్షాకాలమంతా మనింట్లో
పిల్లలుండరు, మనముంటం.
*

-పరమాత్మ 9848552512