S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పండుటాకుల ఆశాగీతం

ఎవరికీ అక్కరలేదు
జాలి, దయా కానరాదు
పో.. పొమ్మంటోంది లోకం
తీరిపోయిందిగా అవసరం

అరవై ఏళ్ల మా కష్టార్జితాన్ని
అప్పనంగా అనుభవించి
ఏరుదాటాక తెప్ప తగలేసినట్లు
ఏమిటో ఈ చీత్కారం

జీవన పోరాటంలో
ఎన్నో ఒడిదుడుకులు
తట్టుకుని నిలిచాం

వీరసైనికుల్లా సాగాం

మమ్మల్ని వద్దంటే
నష్టమెవరికోయ్
అనుభవసారాన్ని అందుకోలేని
దౌర్భాగ్యం మీదేనోయ్

పండుటాకులే మేము
శారీరక శక్తిని కోల్పోయిన వారిమే
కానీ.. గుండెబలం, అనుభవామృతం ఉందోయ్
చివరి క్షణాలనూ మెరిపిస్తే చూడండోయ్
*

-ఎన్.పి.కృష్ణమూర్తి 9966038800