S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పెళ్లి రూమర్స్!

నమిత.. ఒకప్పుడు తెలుగుతోపాటు తమిళంలో సైతం మంచి ఫాలోయింగ్ వున్న హీరోయిన్. వెంకటేష్, బాలకృష్ణ, ప్రభాస్, మోహన్‌లాల్ వంటి స్టార్ హీరోలతో కలిసి సినిమాలు చేసిన ఈమె ప్రస్తుతం ఆఫర్లు తగ్గుముఖం పట్టడంతో పెద్దగా సిల్వర్‌స్క్రీన్‌పై కనిపించడంలేదు. ఇలాంటి తరుణంలో ఆమె పెళ్లి గురించి ఒక సంచలన వార్త బయటికొచ్చింది. అందులో ఆమె సీనియర్ నటుడు శరత్‌కుమార్‌ను వివాహమాడనుందనేది సారాంశం. రెండు మూడు రోజులు ఈ వార్తలు హడావుడి చేశాక శరత్‌కుమార్ స్పందిస్తూ- అవన్నీ పుకార్లేనని తేల్చారు. ఇక తాజాగా నమిత కూడా ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని ఇవన్నీ ఎవరో కావాలని క్రియేట్ చేసినవని, తండ్రి వయసున్న శరత్‌కుమార్‌ను తాను వివాహం చేసుకోవాలనుకోవడం ఏమిటని, వీటిలో ఏమాత్రం నిజం లేదని అన్నారు. దీంతో ఆమె వివాహంపై చెలరేగిన అనసర సంచలనానికి ముగింపు దొరికినట్లయంది.