S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

భలే అల్లుడు (కథ)

కరీంనగర్‌కు చెందిన నర్సింలు వరంగల్ చేరాడు. నాలుగు రోజులు చిన్నమ్మాయి శిరీష దగ్గరుందామని బయల్దేరి వచ్చాడు.
మరునాడు వరండాలో కూర్చుని దినపత్రిక తిరగేస్తున్నాడు. అంతలో వాకిట్లో కారు ఆగింది. మేనల్లుడు గిరి కారు దిగి ఇంట్లోకి వచ్చాడు. ‘మామయ్యా! బయటకెళదాం. సిద్ధంగా ఉండు’ అంటూ లోనికి వెళ్లాడు.
‘శిరీషా! హన్మకొండలో పాత బట్టలు ఎవరో కొంటున్నారట. నీ దగ్గరున్న పాత బట్టలు, పిల్లలవి కూడా మూటగట్టి ఇవ్వు. పట్టుకెళతా’ అన్నాడు.
శిరీష సంబరపడింది. పాత బట్టలన్నీ మూతకట్టి అందించింది. ‘ఇన్ని బట్టలకైనా ఓ స్టీలు గినె్న ఇస్తారట. అందరినీ అడిగి విసిగిపోయాను. మంచి పని చేస్తున్నారు’ అన్నది మెచ్చుకోలుగా.
మూట పట్టుకొని వచ్చి గిరి కారులో కూర్చున్నాడు. ఆ వెంటనే వచ్చి తన పక్కన కూర్చున్న నర్సింలలుతో ‘మామయ్యా! ఇతను రఘు. నాకు మంచి మిత్రుడు. మా వెంట వస్తున్నావు కదా! జరిగేది చూడండి. శిరీషకు ఏదీ చెప్పకండి’ అన్నాడు. నర్సింలు సరే నన్నాడు కుతూహలంగా.
కారు హన్మకొండ బస్టాండ్ దాటింది. దక్షిణం వైపు రోడ్డుకు తిరిగింది. పిదప ఒక గేటు ముందు ఆగింది కారు. కారు ఆగిన చప్పుడు వినబడటంతో గేటు తెరుచుకుంది. కారులోనికి వెళ్లింది. వికలాంగులైన పిల్లలందరూ పరుగు పరుగున కారు చుట్టూ మూగారు. ఆ పిదప పనివాళ్లు వచ్చారు కారు దగ్గరకు.
రఘు కిందికి దిగాడు. కారు డిక్కీ తెరవటంతో పనివాళ్లు అందులోని బియ్యం, పప్పుల సంచులు మోసుకెళ్లారు. గిరి పాతబట్టల మూటను అందించాడు. పిల్లలు దాన్ని మోసుకెళ్లారు. ఆ వెంటనే మూట విప్పి పోటీలు పడి మరీ బట్టలు సంబరంగా తీసుకున్నారు. నర్సింలు అన్నీ శ్రద్ధగా గమనిస్తున్నాడు.
అదొక అనాధ శరణాలయం.
ఆ వాతావరణాన్నీ పిల్లల్నీ గమనిస్తూన్న నర్సింలుని గిరి మేనేజర్ రూంలోకి తీసుకెళ్లాడు. వారితో పాటు వచ్చిన రఘుతో మేనేజర్ ఒక అరగంట మాట్లాడారు. అనాధ పిల్లల బాగోగుల గురించి.. అక్కడి స్థితిగతుల గురించి తెలుసుకున్నారు. మేనేజర్ దగ్గర సెలవు తీసుకుని రఘు, గిరి, నర్సింలు మళ్లీ వరంగల్ బయల్దేరారు.
గిరి తన మామయ్య నర్సింలుతో తన ఇంటి దగ్గర దిగాడు. రఘు కారులో వెళ్లిపోయాడు.
పాత బట్టలు అమ్మటంవల్ల ఏం వచ్చిందో తెలుసుకోవాలన్న ఆత్రుతతో శిరీష ఉత్సాహంగా వారికి ఎదురొచ్చింది. ‘ఇదిగో మూడు వందలు వచ్చాయి’ అంటూ ఆమెకు డబ్బు అందించాడు గిరి.
నర్సింలు తెల్లబోయాడు. చేసిన పని ఒకటి. చెప్పింది మరొకటి. ఆ మూడు వందలకే మురిసిపోతూ శిరీష లోపలికి వెళ్లిపోయింది. అల్లుడు చేసిన పనికి నర్సింలు మెచ్చుకోకుండా ఉండలేక పోయాడు. ‘్భలే అల్లుడు! అటు అనాధ పిల్లలకు బట్టలు అందించావు. ఇటు శిరీషనూ మెప్పించావు. తెలివిమంతుడివే’ అంటూ ప్రశంసించాడు.

వాసాల నరసయ్య