S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

దారితప్పిన సీతాకోక చిలుకలు! ( విజ్ఞానం)

సీతాకోక చిలుకల్లో ‘మోనార్క్ బటర్‌ఫ్లై’గా చెప్పుకునేవి అతిపెద్దవి. నారింజ, నలుగు, తెలుపు ముదురు రంగులతో ఆకర్షణీయంగా కనిపించే ఈ సీతాకోక చిలుకలు రెక్కలు విప్పితే పది సెంటీమీటర్ల వెడల్పు ఉంటాయి. దాదాపు ఐదు నెలలు వీటి జీవితకాలం. భారత్, ఆస్ట్రేలియా, కెనడా, మెక్సికో, అమెరికాల్లో ఇవి కనిపిస్తాయి. అయితే అమెరికాలో ఇవి ఎక్కువ. మిల్క్‌వీడ్ చెట్ల ఆకులు తొలిదశలో వీటి ప్రధాన ఆహారం. అమెరికాలో ఈ చెట్లు ఎక్కువ. అందువల్ల సంతానోత్పత్తి అమెరికాలో జరిపి శీతాకాలంలో రక్షణ కోసం దాదాపు 3వేల 200 కిలోమీటర్లు ప్రయాణించి మెక్సికో, కాలిఫోర్నియా ప్రాంతాలకు వలస వెళ్లడం ఒక విచిత్రం. ఆయా ప్రాంతాల్లో జతకట్టిన తరువాత మగ సీతాకోక చిలుకలు అక్కడే మరణిస్తాయి. గుడ్లు పెట్టేందుకు తిరిగి ఆడ మోనార్క్ సీతాకోక చిలుకలు ఉత్తర అమెరికా, కెనడాలకు తిరిగి వెళతాయి. ఇలా ఏటా దాదాపు వంద కోట్ల మోనార్క్ సీతాకోక చిలుకలు ప్రయాణిస్తాయని అంచనా. ఇది సాధారణంగా జరిగే మోనార్క్ సీతాకోక చిలుకల వలస ప్రత్యేకత. అయితే ఈసారి వాటి వలసకు ఆటంకాలు ఏర్పడటం ఆందోళన కలిగించిన పరిణామం. భూతాపం పెరగడం, గాలుల తీవ్రత ఎక్కువగా ఉండటం వాటి వలసకు ఆటంకం ఏర్పడిందని శాస్తవ్రేత్తలు భావిస్తున్నారు. నవంబర్ ఒకటవ తేదీకల్లా మెక్సికో, కాలిఫోర్నియా ప్రాంతాలకు ఇవి వలస వెళ్లాల్సి ఉంది. అయితే కెనడా, అమెరికాల్లోని తమ నివాస ప్రాంతాల నుంచి అవి లక్షల సంఖ్యలో బయలుదేరినప్పటికీ మధ్యదారిలోనే అవి ఆగిపోయాయి. సముద్ర తీరాల్లోని చెట్లపై ఉండిపోయాయి. వాటిలో కొన్ని ఎగరే ప్రయత్నం చేస్తూ గాలుల తీవ్రతతో నీటిలో పడి మరణిస్తున్నాయి. వేల సంఖ్యలో సీతాకోక చిలుకలు దారితప్పిపోవడం ఇప్పుడు సంచలనవార్తగా మారింది. అయితే తొలిసారిగా తమ ప్రాంతాల్లో కనిపిస్తున్న సరికొత్త అతిథులను చూసి స్థానికులు ముచ్చటపడుతున్నారు. కెనడా, అమెరికాలో కొన్ని ప్రాంతాలకు పరిమితమైన ఈ మోనార్క్ సీతాకోక చిలుకలు వలస ప్రయాణం మొదలుపెట్టి దారితప్పి ఆయా దేశాల్లోని తీర ప్రాంతాల్లో చిక్కుకుపోయాయి. న్యూజెర్సీ, కేప్ వంటి ప్రాంతాల్లోనూ అవి కన్పిస్తున్యా. ఈ మోనార్క్ సీతాకోక చిలుకల వలసను ట్రాక్ చేసే ఎన్‌జిఒ సంస్థకు చెందిన జీవశాస్తవ్రేత్త ఎలిజబెత్ హోవార్డ్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. కొత్త ప్రాంతాల్లో అందమైన మోనార్క్ సీతాకోక చిలుకలను చూడడం ఆనందంగానే ఉన్నా అవి దారితప్పడం, అందుకు గల కారణాలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన అంటున్నారు. భూతాపం వల్ల రుతువులు కాలపరిమితి మారిపోవడం ఇలా జరగడానికి కారణమని ఆయన అంటున్నారు. మేడిసన్ ప్రాంతంలో కొత్తగా మోనార్క్ సీతాకోక చిలుకలను చూశానని, వీటిలో చాలావరకు ప్రతికూల పరిస్థితుల్లోనే తమ గమ్యాన్ని చేరుకున్నాయని విస్కాన్సిన్ యూనివర్శిటీకి చెందిన బయాలజిస్ట్ కరెన్ ఒబర్‌హాసర్ అన్నారు. కేటర్‌పిల్లర్ దశరో మోనార్క్ సీతాకోకచిలుకలు మిల్క్‌వీడ్ మొక్కల ఆకులను మాత్రమే తింటాయి. అయితే ఆ చెట్ల సంఖ్య తగ్గడం కూడా ఈ ప్రత్యేక జాతి సీతాకోక చిలుకలకు కష్టాలు తెచ్చిపెడుతోంది. ఈపాటికే టెక్సాస్, మెక్సికోలకు చేరాల్సిన ఈ సీతాకోకచిలుకల ప్రయాణం ఇంకా పూర్తికాలేదు.

-ఎస్.కె.ఆర్.