S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

తల్లి తండ్రి ఒకడే

పద్యం రాస్తున్నాను
సముద్రం చూస్తూ ఉంది
స్ర్తిలింగం పుంలింగం ధరించిన జలధి
ఒకరికి తండ్రి సముద్రుడు
ఒకరికి తల్లి సముద్రం!
ఉధృతమై అలలు ముందుకురుకుతుంటే
ప్రమాదాన్ని పసిగట్టి సముద్రుడు
ముక్కుతాడేసి లాగుతుంటాడు
అలల్లో చిక్కిన మానవుడు
అసువులు బాసినపుడు
అలలెంతగా కన్నీరు విరజిమ్ముతాయో
వీక్షకులు ప్రత్యక్ష సాక్షులు
విగత జీవుల్ని వొడ్డుకు చేర్చి
సముద్ర గర్భంలో ఎవరూ దాగిలేరని
శే్వతపత్రం విడుదల చేస్తుంది
నిద్రించే చరాచరాలకు
మేల్కొల్పు చెప్పటానికి
సముద్రం నిత్యం ఘోషిస్తుంది
సూర్యుడు చంద్రుడు తన బిడ్డలని
పగలు రాత్రి తోడుండే అమరులని
మురిపెంగా చెప్పి మురుస్తుంది!
సముద్రుడు అరిస్టాటిల్‌కు
ప్రియాతి ప్రియమిత్రుడు
వొడ్డున నిల్చిన వీక్షకులకు
ఓడను పైనించి కిందికి
అంచెలంచెలుగా చూపి
భూమి గుండ్రమని పాఠ్యాంశం చేస్తాడు
యుగాలుగా నడకల కింద
నలగడమే కాని
నిర్మాణానికి నిరుపయోగమయ్యానని
తీరంలో తిష్ఠేసిన ఇసుక
తల్లి సముద్రంతో నిష్ఠూరాలాడుతుంది
గాలికి సముద్రానికి రక్తసంబంధం
వొళ్లు కాలిన గాలి
సముద్రంలోకి నడిచి శీతలవాయువై
చెలియలికట్టను దాటుతుంది
చీకట్లో చూపు కానక ఓడలు
ఎక్కడ దారి తప్పుతాయోనని
లైట్‌హౌస్ జాడ చూపుతుంది
దారి చూపుతూ వెనె్నల
తోడుగా చంద్రుడు నా వెంట నడుస్తుంటే
నా చిన్న కొడుకు చంద్రుణ్ని తెల్లగా మార్చింది
పెద్దకుమారుడు సూర్యుడంటుంది సముద్రం!

-అడిగోపుల వెంకటరత్నమ్ 9848252946