S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

యుద్ధ మేఘాలు

రెండవ ప్రపంచ యుద్ధం మిగిల్చిన ప్రేతాత్మలన్నీ యింకా
రణ భూమిలోని ఎండిన మోడుల మీద వ్రేలాడుతూనే ఉన్నాయి
హిరోషిమా నాగసాకీల మారణహోమాల జ్ఞాపకాలు
చరిత్ర పాఠాల నుంచి ఇంకా చెరిగిపోనే లేదు
అగ్రరాజ్యపు అహంకారానికి అట్టుడికిన అణువంత దేశాలు
అణ్వాయుధాలకు టోకున చేసిన అనికి కాలుదువ్వుతున్నాయి
ప్రకృతి ప్రకోపాల సునామీలను, హరికేన్‌లను, టోర్నడోలతో
అతలాకుతలమవుతున్న ప్రపంచ దేశాల ప్రజానీకం
కయ్యానికి సిద్ధమవుతున్న నియంతల దాష్టీకానికి
చిగురుటాకులలా వణికిపోతున్నాయి
త్రిదళాధిపతుల ఎడతెరపిలేని ఆయుధ విన్యాసాలు
సకల దేశాల ప్రజల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి
నియంతృత్వ పోకడలతో నడిచే నాయకులారా
మీ స్వార్థం కోసం మనుషులపై మరణ మృదంగాలు వాయించకండి
అణ్వాయుధ పరీక్షలకు స్వస్తి పలికి
అనిర్వచనీయమైన స్నేహానికి తలుపులు తెరవండి
ప్రకృతి పూల సజ్జలను స్మశానవాటికలుగా మార్చకండి
సామరస్యంతో సాధించలేని విజయం లేదని చాటండి
మదర్ థెరిసా వారసులుగా శాంతి కాంక్షించే నేతలుగా
మరో ప్రపంచ యుద్ధపు వాకిళ్లను మూసివేయండి.

-శింగరాజు శ్రీనివాసరావు 90520 48706