S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆకట్టుకొంది (మాతో-మీరు)

జనవరి 24, ఆదివారం అనుబంధంలో ‘బాలమురళీకృష్ణ’ ప్రత్యేక వ్యాసం మా ఇంటిల్లిపాదినీ ఆకట్టుకొంది. ఆయన ఇంటర్వ్యూ సంగీత ప్రియులందరికీ ఆకర్షణీయమైనది. మురళిగారి కీర్తనల్లో రాగం భోగం స్నేహం మోహం దోబూచులాడుతుంటాయి. ఆవేదన ఆకాంక్ష తపన కొట్టొచ్చినట్టు కనపడతాయి.
-పట్నాల సూర్యనారాయణ (రాజమండ్రి)
సండే గీత
జీవితంలో సహజత్వాన్ని అలవరచుకొని ప్రతీ క్షణం అనుభవిస్తూ ఆనందంగా ఉండాలన్న అద్భుత సత్యాన్ని ‘సండే గీత’ చక్కగా వివరించింది. పెన్సిల్ నుండి ఎలా స్ఫూర్తి పొందాలో ఓ చిన్నమాట ద్వారా తెలుసుకున్నాం. మల్లాదిగారి ‘స్ఫూర్తి’ ద్వారా విలువైన ఆధ్యాత్మిక సత్యాలను ఆకళింపు చేసుకొనే అవకాశం కలుగుతోంది. భగత్‌సింగ్ జీవిత చరిత్ర మాలో భారతీయతనూ, దేశభక్తినీ పెంచుతున్నాయి. ఈ మహనీయులను స్మరించుకునే అవకాశం లేకపోవడం వల్లనే నేటితరం ఎన్నో విలువలను, క్రమశిక్షణను కోల్పోతుందనేది నిర్వివాదాంశం. గీతను జీవన గీతగా మార్చుకొనేందుకు స్ఫూర్తిని ‘వినదగు’ ద్వారా పొందుతున్నాం. ఈ వారం ఆత్మతత్వాన్ని డా.వాసిలిగారు అత్యద్భుతంగా ఆవిష్కరించారు. భగవద్గీతలోని శ్లోకాలకు మానసిక, శారీరక, ఆధ్యాత్మిక, మేనేజ్‌మెంట్ రంగాలకు అన్వయిస్తూ ఇస్తున్న భాష్యం అద్భుతంగా, వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడేలా ఉంటోంది. అలాగే సంగీత ప్రపంచంలో ఒక నూతన వొరవడిని సృష్టిస్తూ కోట్లాది భారతీయుల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్న బాలమురళీకృష్ణ గారితో ఇంటర్వ్యూ చదివి పరవశించిపోయాం.
-సి.ప్రతాప్ (శ్రీకాకుళం)
మీకు తెలుసా?
మకరందం, పుప్పొడి మాత్రమే తినే చిలుకలు, 12 అడుగుల కాళ్లున్న స్పైడర్ క్రాబ్, పచ్చపుచ్చకాయలు.. ఇత్యాదివి ఎంతో ఆశ్చర్యపరిచాయి. తరచిచూస్తే ఈ భూమీద వింతలెన్నో! వృధాగా పారేసే బిర్యానిలో దేవుడు కనిపించాడు బిచ్చగాడికి - అంటూ చెప్పిన ‘సండే గీత’ బాగుంది. బిచ్చగాళ్లకి సంబంధించి ఓ రెండు విషయాలు. ఓ రోజు షాపింగ్‌కి వెళ్తున్నప్పుడు కనిపించిన బిచ్చగాడు రెండు రోజులుగా భోజనం లేదు. ఐదు రూపాయలిమ్మని ప్రాధేయపడ్డాడు. ఇంటికొస్తే భోజనం పెడతా అని చెప్పినా వాడు డబ్బు కోసమే బతిమిలాడాడు. తర్వాత తెలిసింది వాడికి భోజనం కాదు తాగడానికి డబ్బులు కావాలని! తాజా సర్వే ప్రకారం సాధారణ ఉద్యోగికన్నా బిచ్చగాడి ఆదాయమే ఎక్కువ!
-సి.మైథిలి (సర్పవరం, తూ.గో.జిల్లా)
గోల మనుషులం
మనం ఎవరినీ ప్రేమించకపోతే మనల్ని ఎవరూ ప్రేమించరన్న ఓ చిన్న మాటలో జీవిత సత్యం కనిపించింది. ‘గోల మనుషులం’ అంటూ గోపాలంగారు చెప్పిన గోలాయణం భలేగా ఉంది. ఆ గోలాయణంలోనూ ఒక మణిపూస ఉంది. ‘మెదడు నిండా ఉన్న గోలవల్ల బతుకు ప్రేమ పిలుపు కూడా మనకు వినిపించదు’ అన్నదే ఆ మణిపూస. యధాలాఫ కబుర్లలో అనుకోకుండా బయటపడ్డ నిజాలే నేరగాళ్లని పట్టిస్తాయని క్రైం కథ మంచి ఉత్కంఠతతో నిరూపించింది. రాజుగారి కోటలో శోకగృహాలు, కోపగృహాలు ఉండేవని చదువుకున్నాం. ఉద్యోగినుల టెన్షన్ పోగొట్టడానికి జపాన్‌లో నిర్వహిస్తున్న సాంత్వన గృహాలు అలాంటివే. కూటి కోసం కోటి విద్యలన్నారు మనవాళ్లు. సానుభూతి చూపడం, సాంత్వన కలిగించడంతో సహా వ్యాపారానికి కాదేదీ అనర్హం అని నిరూపిస్తున్నారు జపనీయులు.
-ఆర్.మరుదకాశి (కరప)
‘పెద్దల మాట’
‘పెద్దల మాట’ ద్వారా - తెలివిగలవారు ఎప్పుడూ కూడా ఇతరులు వైఫల్యం పొందిన చోట నుంచి విజయాన్ని సాధించటం ప్రారంభిస్తారు - అన్న ఎల్‌స్టోన్‌గారి అమూల్య ఆర్యోక్తిని పునశ్చరణ గావించుకునే మహద్భాగ్యాన్ని కలిగించినందుకు ధన్యవాదాలు. భార్యాభర్తలు ధనస్సు లాంటి వారంటూ ప్రస్తావిస్తూ సాగిన ‘్ధనస్సు’ భార్యాభర్తలకే కాదు.. అన్ని సంబంధాలకు వర్తిస్తుంది.. అన్న ముగింపు వాక్యంతో ఎంతో స్ఫూర్తిదాయకంగా తీర్చిదిద్దబడి మా ఇంటిల్లిపాదినీ అలరించింది. ‘మీకు తెలుసా?’ శీర్షికలోని వివిధ అంశాలు ఎంతో ఆసక్తిదాయకంగా ఉంటూ, ఆనందాశ్చర్యాలను ఏకకాలంలో కలుగజేసి అశేష పాఠకుల మన్ననలను పొందుటలో సఫలీకృతమవుతున్నాయి.
-అల్లాడి వేణుగోపాల్ (బారకాసు)
గానకళాతృష్ణ...
ఈ వారం స్పెషల్ ‘గాన కళాతృష్ణ.. బాలమురళికృష్ణ’ ఇంటర్వ్యూ సంగీతాభిమానులకు అపూర్వ అమృతాల విందు. వినదగునంటూ ‘మనమే గుర్తించని రీతిలో మనం తప్పిపోతున్నాం. మన జీవితాలన్నీ ప్రేమ, ద్వేషాల మధ్యనే కదలాడుతాయి. ప్రేమవైపు మొగ్గితేనే జీవనయోగం’ అని చెప్పడంలో ఎంతో విజ్ఞత ఉంది.
-డి.అభిలాష (సాంబమూర్తినగర్, తూ.గో.)
ఆర్ట్ ఎట్ తెలంగాణ
‘ఆర్ట్ ఎట్ తెలంగాణ’ వ్యాసం బాగుంది. దర్శకులు నరసింగరావు చెప్పిన విశేషాలు బాగున్నాయి. అలాగే గ్యూటన్‌బర్గ్ జీవిత విశేషాలూ.. అచ్చుయంత్రం వివరాలు బాగున్నాయి.
-చోడవరపు నాగేశ్వరరావు (హైదరాబాద్)
షేక్‌స్పియర్
డబ్బుతో కొనే వస్తువులను కొనడం మంచిదే కానీ, డబ్బుతో కొనలేని వస్తువులను పోగొట్టుకోవడం మాత్రం మంచిది కాదు - అన్న పెద్దల మాట ద్వారా షేక్స్‌స్పియర్‌ను స్మరించుకునే సదవకాశం కలిగింది.
-ఎ.గోపాల్ (శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు)