S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎలావుందీ వారం? ( ఫిబ్రవరి 14 నుండి 20 వరకు)

మేషం (ఏప్రిల్ 15 - మే 14)

ఇబ్బందులను అధిగమించడానికి వీలుగా దినచర్యలలో మార్పులు చేసుకుంటారు. ఇతరుల అభిప్రాయాలు విన్నా అంతిమ నిర్ణయం మీదేనని గ్రహించండి. చురుగ్గా పాల్గొని ఉద్యోగ, వాణిజ్యాలను ఆదర్శవంతంగా నిర్వహిస్తారు. ఆదాయంలో అభివృద్ధి ఉండటంతో సంక్షేమ, వినోద కార్యక్రమాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. పరిశోధనలు, చర్చలు, పోటీలు మీ ప్రతిభకు అద్దం పట్టేవిగా ఉంటాయనవచ్చు. రాజకీయ మార్పులు మీకు లాభదాయకంగా ఉండవచ్చు.

వృషభం (మే 15 - జూన్ 14)

ఆది, సోమవారాల్లో ఆవేశాలకు తావీయకండి. ఇతరులకు మీ ఆలోచనలు క్లుప్తంగా వివరించి మీ పని మీరు చేసుకుపోవడం ఉత్తమం. ప్రయాణాలు, సమావేశాలు, ఒప్పందాలు, ఒడంబడికలతో వారమంతా బిజీగా ఉంటారు. విద్యార్థులు ఏకాగ్రతతో, చిత్తశుద్ధితో కృషి చేయాల్సిన సమయమిది. సంస్కరణలు, ప్రబోధాల ద్వారా అనుచరుల ప్రవర్తనలో మార్పు తీసుకురా గలుగుతారు. సన్నిహితుల మధ్యవర్తిత్వంతో ముఖ్యమైన పనులు కొన్ని పూర్తవుతాయి. చిరకాల కోరికలు కొన్ని శుక్ర, శనివారాల్లో తీరుతాయి.

మిథునం (జూన్ 15 - జూలై 14)

ఊహించని రీతిలో వ్యవహారాలు వేగంగా సాగడం మీకు ఆనందాన్నిస్తుంది. సన్నిహితులతో కలిసి భవిష్యత్ ప్రణాళికల గురించి విస్తృతంగా చర్చలు జరుపుతారు. ఉత్సాహవంతులయిన అనుచరులు, మిఅతులు లభిస్తారు. ఆలస్యం జరిగినా ఆర్థిక లావాదేవీలు మంచి ఫలితాలనే ఇస్తాయి. అధికారులు, బంధువర్గంతో సంబంధాలు మెరుగవుతాయి. ఆరోగ్య పరిరక్షణ చర్యలు అమలుపరిచి మెరుగైన ఫలితాలు అందుకుంటారు.

కర్కాటకం (జూలై 15 - ఆగస్టు 14)

వాయిదా పడిన కార్యక్రమాలు మంగళ, బుధవారాల్లో పునః ప్రారంభం కావచ్చు. ఆశ్చర్యకరమైన విషయాలు మీ దృష్టికి వస్తాయి. కొత్త ఒప్పందాలు, కార్యారంభాలకు 18, 19 తేదీలు అనుకూలించవచ్చు. మీ కృషికి తగిన గుర్తింపు, ప్రోత్సాహం అన్ని వర్గాల నుండి లభిస్తుంది. ఇతరులకు బాధ్యతలను అప్పగించడం ద్వారా కొన్ని ఇబ్బందులను అధిగమిస్తారు. నియమ నిష్ఠలతో కృషి చేసి తోటివారికి ఆదర్శంగా నిలుస్తారు.

సింహం (ఆగస్టు 15 - సెప్టెంబర్ 14)

సర్వజనులకు సమ్మతమైన విధంగా మీ ప్రణాళికలను రూపొందించి వివరిస్తారు. కార్యభారం, శ్రమ అధికంగా ఉన్నా లెక్కచేయక లక్ష్యసాధనలో నిమగ్నమవుతారు. దేవాలయాలు, రమణీయ స్థలాలు సందర్శిస్తారు. బృందాలు, గ్రూపులు తయారుచేసి నూతన లక్ష్యాల దిశగా నడిపిస్తారు. వృత్తి ఉద్యోగాలు యధావిధిగా సాగుతాయని ఆశించవచ్చు. అనుకోని సంఘటనలు, దృశ్యాలు మీ భవిష్యత్ ప్రణాళికలకు ప్రేరణగా నిలుస్తాయి. ఆదాయం పెరుగుతుంది.

కన్య ( సెప్టెంబర్ 15- అక్టోబర్ 14)

మీ అనుయాయులు, అనుచరుల అనుమానాలు, భయాలు తొలగించి కార్యోన్ముఖులను చేయగలుగుతారు. ఉద్యోగ వృత్తి రంగాల్లో లాభనష్టాలు బేరీజు వేసుకుని అడుగు ముందుకేస్తారు. విలువైన వస్తువులు అమర్చుకో గలుగుతారు. మీ గొప్పదనాన్ని, ఔదార్యాన్ని గుర్తించి సన్నిహితులు మీ విజయానికి చేయూత నిస్తారు. ఆచరణ యోగ్యమైన పథకాలను చేపట్టి ఉన్నత వర్గాల దృష్టిని ఆకర్షిస్తారు. ఖర్చులు పెరుగుతున్నా ఆదాయ మార్గాలు కూడా పెరగడంతో చింతించాల్సిన పని లేదు. శుభవార్తలు వింటారు.

తుల (అక్టోబర్ 15- నవంబర్ 14)

విశ్వసనీయ వర్గాల ద్వారా అవసరమైన సమాచారాన్ని రాబట్టుకో గలుగుతారు. సమయోచిత నిర్ణయాలు, మార్పులు చేపట్టి అవరోధాలను అధిగమిస్తారు. పెద్దలు, అధికారులు మీకు తోడుగా ఉంటారనడంలో సందేహం లేదు. సలహాలు, సంప్రదింపుల ద్వారా ఆశ్రీతుల, ఆత్మీయుల అశాంతిని తొలగించ గలుగుతారు. వృత్తి ఉద్యోగాలు మీ ప్రతిభా పాటవాలకు నిదర్శనంగా నిలుస్తాయి. బోధన, రవాణా, విద్యారంగాల్లో నూతన అవకాశాలు లభించి ప్రోత్సాసాన్నిస్తాయి.

వృశ్చికం (నవంబర్ 15-డిసెంబర్ 14)

లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని విజయం సాధిస్తారు. మినహాయింపులు, రాయితీల కోసం పెట్టుకున్న అర్జీలు పరిగణింపబడవచ్చు. శుక్ర, శనివారాల్లో కొత్త వ్యక్తుల కలయిక, విందులు, వినోదాలు, విహారాలు, శుభ వార్తాశ్రవణం మీలో ఉత్తేజాన్ని నింపుతాయి. మీ ప్రతిభను మాటలలోకాక చేతలలో చూపించి కొంతమందికి కనువిప్పు కలిగిస్తారు. బంధుమిత్రుల రాకపోకలు పెరుగుతాయి. ఆదాయం బాగానే ఉన్నా ఖర్చులు మీ అంచనాలను మించవచ్చు.

ధనస్సు (డిసెంబర్ 15-జనవరి 14)

సదాశయంతో మీరు చేసే పనులకు కొందరు వక్రభాష్యం చెప్పినా పట్టించుకోనక్కరలేదు. నిజం నిలకడ మీద బయటపడి మీ గొప్పదనం బహిర్గతమవుతుంది. ఖర్చులు విరివిగా చేయాల్సి వచ్చినా ఆదాయ లోపం ఉండదని చెప్పవచ్చు. క్రయ విక్రయాలు వాయిదా వేయడం మేలు. ఇతరుల బాధ్యతలు కొన్ని మీరు నెరవేర్చవలసి వస్తుంది. ఆధ్యాత్మిక, వైజ్ఞానిక రంగాల్లో మీ కృషి పలువురి దృష్టిని ఆకర్షించేదిగా ఉంటుంది.

మకరం (జనవరి 15-ఫిబ్రవరి 14)

అభివృద్ధి పథంలో సాగుతున్న పనులు ఇతరుల జోక్యంతో కుంటుపడే సూచనలున్నాయి. మాటలలో కాక, మీ ధైర్యసాహసాలను చేతులలో చూపించడం శ్రేయోదాయకం. బ్యాంకు లావాదేవీలు, భాగస్వామ్యాలు, వేడుకలు, ఉన్నత స్థాయి సమావేశాలు ఈ వారంలో ప్రాముఖ్యత సంతరించుకుంటాయి. లలితకళలు, సాంస్కృతిక కార్యక్రమాలు కొంత ఆహ్లాదాన్ని కలుగజేస్తాయి.

కుంభం (ఫిబ్రవరి 15-మార్చి 14)

గృహ స్థల మార్పిడులకు అవకాశాలు అధికం. మీ బుద్ధిచాతుర్యంతో సభలు, సమావేశాలలో రాణిస్తారు. పరిస్థితులు మారి మీ మాటకు, చేతలకు ప్రాధాన్యత పెరుగుతుంది. ప్రముఖ వ్యక్తులను కలుసుకుని, చర్చించి భవిష్యత్ కార్యక్రమాలకు అవసరమైన వనరులు, వసతులను సమకూర్చుకుంటారు. వ్యక్తిగత అభిప్రాయాలను గోప్యంగా ఉంచడం ఉత్తమం. దూరమైన మిత్రులు చేరువవుతారు. ప్రయాణాలకై ఖర్చులు పెరిగినా ఫలితాలు సంతృప్తికరంగానే ఉంటాయి. యాంత్రిక లోపాలు సవరించబడతాయి.

మీనం ( మార్చి 15- ఏప్రిల్ 14)

పర్యవసానాలను గురించి ఆలోచించక నియమబద్ధంగా వ్యవహరించాలని తాపత్రయ పడతారు. సర్వీసులు, చేతివృత్తుల వారు నూతన అవకాశాలు లభించి ముందడుగు వేసే సూచనలున్నాయి. మంగళ, బుధవారాలు వివిధ పథకాలు, లావాదేవీలు ప్రారంభించి లబ్ధి పొందగలుగుతారు. ఖర్చులకు తగినంత ఆదాయం ఏదో విధంగా మీ చేతికందుతుంది. బిల్లులు, వాయిదాలు చెల్లించి మనశ్శాంతిని పొందుతారు. కుటుంబ విషయాల్లో మీ అభిప్రాయాలు ప్రాముఖ్యత సంతరించుకుంటాయి.

ఎస్.రవిప్రకాశ్