S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వ్యాయామంతో మెదడుకు మేలు( విజ్ఞానం)

మెదడు చురుకుగా పనిచేయడానికి కొన్ని రకాల ఆహారం, మరికొన్ని రకాల మందులను వినియోగించాల్సిన పని ఇక లేదు. శరీరానికి పనిచెప్పి స్వేదం చిందిస్తే చాలు మీ మెదడు చురుకుగా మారిపోతుందట. నిజానికి వ్యాయామంతో మెదడు ఆరోగ్యం చక్కగా మెరుగుపడుతుందని తాజా అధ్యయనం స్పష్టంగా చెబుతోంది. వెస్ట్‌ర్న్ సిడ్నీ యూనివర్శిటీకి చెందిన ఆస్ట్రేలియా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాంప్లిమెంటరీ మెడిసన్, యూనివర్శిటీ ఆఫ్ మాంచెస్టర్‌కు చెందిన సైకాలజీ మరియు మానసిక ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో శాస్తవ్రేత్తలు తాజా అధ్యయనం నిర్వహించారు. మెదడు పనిచేయడంలోను, జ్ఞాపకశక్తికి సంబంధించిన అంశాలను నియంత్రించడంలో కీలకమైన మెదడులోని హిప్పోకాంపస్ భాగానికి ఎరోబిక్ వ్యాయామం చేయించడం వల్ల కలిగే ప్రభావాన్ని వీరు పరిశీలించారు. వయసు పెరుగుతున్నకొద్దీ మెదడు ఆరోగ్యం క్షీణిస్తుంటుంది. నలభై ఏళ్లు దాటిన తరువాత మెదడు పనితీరులో ప్రతి పదేళ్లకు 5 శాతం చొప్పున తగ్గిపోతుంటుంది. నిజానికి శారీరక వ్యాయామం వల్ల మెదడులోని హిప్పోకాంపస్ భాగం పరిమాణం కాస్తంత పెరగడం ఎలుకలు, చుంచులపై జరిగిన పరిశోధనల్లో తేలింది. అందువల్ల వాటిలో మెదడు పనితీరు మెరుగుపడింది కూడా. ఇప్పుడు తాజాగా మానవుల్లోనూ ఆ తరహా ప్రభావం ఉన్నట్లు గుర్తించారు. దాదాపు 237 మంది తమ అధ్యయనం కోసం సిద్ధం చేశారు. 14సార్లు క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. ఎప్పటికప్పుడు మెదడుకు స్కానింగ్ చేశారు. ఎరోబిక్ వ్యాయామానికి ముందు, వ్యాయామం పూర్తయిన తరువాత మెదడుకు ఈ స్కానింగ్ పరీక్షలు నిర్వహించారన్నమాట. ఈ పరిశోధనల్లో పాల్గొన్న పౌరుల్లో ఆరోగ్యంగా ఉన్న పెద్దలు, అల్జీమర్స్, కాస్తంత మతిమరుపు ఉన్నవారు ఉన్నారు. మానసిక సమస్యలు ఉన్నవారు, ఒత్తిడి వంటి సమస్యలు ఉన్నవారు కూడా ఉన్నారు. వీరిలో 24 నుంచి 76 ఏళ్లవయసున్నవారు ఉండేలా చూసుకున్నారు. స్టేషనరీ సైక్లింగ్, నడక, ట్రెడ్‌మిల్ రన్నింగ్ వంటి ఏరోబిక్ వ్యాయామాలను వీరితో చేయించారు. మూడు నుంచి 24 నెలల పాటు వారానికి రెండు నుంచి ఐదు సెషన్స్ చొప్పున వారిపై పరిశోధనలు నిర్వహించారు. మానవుల్లో ఈ వ్యాయామం తరువాత హిప్పోకాంపస్ ఎడమభాగంలో పరిమాణం కాస్త పెరగడాన్ని వీరు గుర్తించారు. అయితే ఆ అవయవంలో మిగతా భాగంలో మాత్రం ఎటువంటి మార్పు గోచరించలేదు. తాజా అధ్యయనం ప్రకారం ఇప్పటివరకు దొరకని ఆధారాలు లభ్యమైనట్టేనని, వ్యాయామాల వల్ల మెదడు ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుందని తేలినట్టేనని ఈ అధ్యయనానికి నాయకత్వం వహించిన జోసెఫ్ ఫిర్త్ చెప్పారు. వ్యాయామం చేస్తున్నప్పుడు మెదడులో ఉత్పత్తి అయ్యే న్యూరోట్రోఫిక్ ఫ్యాక్టర్ (బిడిఎన్‌ఎఫ్) ఉత్పత్తి అవుతుండటాన్ని వీరు గుర్తించారు. దీనివల్ల వయోభారంతో వచ్చే మెదడు సంబంధిత అనారోగ్యాన్ని నెమ్మదింపచేయడం సాధ్యమవుతుంది. వయసు పెరిగినప్పటికీ ఆరోగ్యంగా ఉండేవారు ఈ వ్యాయామాలను కొనసాగించడం మరింత మేలు చేస్తుందని అల్జీమర్స్, డిమెన్షియా వంటి నాడీసంబంధ వ్యాధులబారిన పడకుండా ఉండవచ్చని ఆయన అంటున్నారు. అయితే ఈ విషయంలో మరిన్ని పరిశోధనలు అవసరమన్నది ఆయన వాదన. వయసుపెరుగుతున్నప్పుడు వ్యాయామాల ద్వారా మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చన్నది రుజువైన చికిత్సల్లో ఒకటని ఆయన అంటున్నారు. న్యూరో ఇమేజ్ అన్న జర్నల్‌లో ఈ మేరకు అధ్యయనం ఫలితాలను ప్రకటించారు.

-ఎస్.కె.ఆర్.