S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎలా ఉందీ వారం? ( నవంబర్ 19 నుండి 25 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

విజయ సిద్ధి. ఉత్సాహంతో కార్యసిద్ధి. పెద్దల సహకారం అందుతుంది. ఒత్తిడిని తట్టుకుంటారు. శత్రు విజయం సాధిస్తారు. అవమానాలను తట్టుకుంటారు. ఖర్చులు పెరుగుతాయి. మిత్రులతో సఖ్యత మేలు. ప్రశాంత వాతావరణానికై యత్నించండి. ఎంచుకున్న రంగాలు మెరుగవనున్నాయి. పెట్టుబడులు తృప్తిగా ఉంటాయి. అభివృద్ధిని సాధిస్తారు. కొన్ని పనులు లోగడ ఆగినవి తిరిగి పూర్తి చేస్తారు. కుటుంబ వ్యవస్థ మెరుగవుతుంది. ఐటి, వృత్తి, వ్యాపార, ఇతర రంగాలు నిపుణతతో గుర్తింపును అందుకుంటారు.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)

అప్రమత్తతతో ముఖ్య కార్యాలు పూర్తి చేయాలి. పొరపాట్లు రానీయకండి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. నష్టాలు తగ్గుతాయి. దగ్గర వారి సూచనలు, సలహాలు తీసుకున్నప్పటికీ నిర్ణయాత్మకంగా మెలగండి. అవసరానికి ధనం అందుతుంది. ఆధ్యాత్మిక ఉన్నతి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ఉద్యోగ, వ్యాపారాలలో తడబాటు రానీయకండి. స్పెక్యులేషన్ ఊహించిన దానికంటె మెరుగవుతుంది. అనుకోని శుభాదులను ఒడిసి పట్టుకోవాలి. ఆర్థిక పుష్టి. విజయ ప్రాప్తి. వృత్తి, వ్యాపార, వ్యవహార, ఉద్యోగ రంగాలు గతం కంటె వృద్ధిలో ఉంటాయి.

మిథునం (మృగశిర 3,4 పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
శుభ తరుణం. కష్టాల నుంచి ఇష్టాల వైపు వెళ్లనున్నారు. ముందంజ వేయండి. రాబోయే కాలం బాగుంటుంది. అందుకు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. వినయ విధేయతలతో అధికారులను మెప్పిస్తారు. విరోధుల నుంచి తప్పించుకోండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహార రంగాలు తృప్తినిస్తాయి. పెట్టుబడులు రాబడికి మార్గాలుగా గుర్తింపు తెస్తాయి. శుభవార్తలు వింటారు. అన్నింటా గుర్తింపు లభిస్తుంది. అనుకోని ముఖ్యమైన పనుల నిమిత్తం ప్రయాణాలు చేయాల్సి రావచ్చు.

కర్కాటకం (పునర్వసు 4 పా, పుష్యమి, ఆశే్లష)
శుభకాలం సమీపించింది. చురుగ్గా నిర్ణయాలు తీసుకుంటారు. నమ్మకమే మిమ్మల్ని అన్నింటా గెలిపిస్తుంది. తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. గతంలో నిలిచిన పనులు పూర్తవుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ, సాంకేతిక రంగాలు మెరుగవుతాయి. ప్రయాణాలు హితులతో కలిసి సంతోషంగా చేస్తారు. నూతన వస్తు, వస్త్ర లాభాలు. ప్రలోభాలకు లొంగకండి. బంధుమిత్రుల రాకపోకలు ప్రయోజనకారిగా ఉంటాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా)
అభీష్ట సిద్ధి. పనులందు ప్రగతి సాధిస్తారు. చంచల రహితంగా మెలగండి. ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉంది. ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుంటారు. బంధువుల నుంచి ప్రోత్సాహకాలున్నాయి. ఎదురుచూస్తున్న పనులు పూర్తవుతాయి. అనుకోని సంఘటనల వల్ల ఇబ్బందులు ఎదురయ్యేట్లు ఉన్నాయి. అంతిమంలో శుభ ఫలితాలు ఉంటాయి. తగినంత విశ్రాంతి తీసుకోవాలి. అనుకోని ప్రయాణాలున్నాయి. స్పెక్యులేషన్ దీర్ఘకాలికం. శిరోవేదనను తగ్గించుకోండి.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త 1,2 పా)
శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో సందడిగా ఉంటారు. పనుల్లో స్పష్టతకై పరిశీలన అవశ్యం. వృత్తి, ఉద్యోగ, వాణిజ్య రంగాలు గతం కంటె బాగుంటాయి. సమయానికి శుభాలను అందుకుంటారు. ఆర్థిక లావాదేవీలు సఫలం. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. స్పెక్యులేషన్‌లో స్వల్ప లాభం. విజయావకాశాలు మీకై ఎదురుచూస్తున్నాయి. పైకం సమయానుకూలంగా అందుతుంది.
తుల (చిత్త 3,4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పా)
సందడి వాతావరణం నెలకొంటుంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి విజయావకాశాలను అంది పుచ్చుకుంటారు. పనులు సానుకూల పడతాయి. మాట పట్టింపులు రాకుండా చూసుకోండి. దంపతుల మధ్య ఏకాభిప్రాయం మేలు. ఖర్చులు ఆదాయానికి తగ్గట్లుంటాయి. వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. వారాంతంలో శుభ పరిణామాలు. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలకు ఇబ్బందులు రాకుండా చూసుకోండి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. కొత్త విషయాలకు అనుకూలం.

వృశ్చికం (విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ట)

అనుకున్నవి పూర్తి చేస్తారు. ఆకస్తకరమైన విషయాలు తెలుసుకొంటారు. చెల్లింపులు, డబ్బు స్వీకరణలలో జాగ్రత్త వహించండి. స్ర్తిల వ్యాపారాలు విస్తరిస్తాయి. కొత్త పరిచయాలు ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఒక సమస్య సానుకూలమవుతుంది. స్పెక్యులేషన్ జయప్రదం. ఆత్మీయులు కలుస్తారు. కుటుంబ పనుల నిమిత్తం సమయాన్ని కేటాయించవలసి వస్తుంది. సాంఘిక కార్యకలాపాలలో గుర్తింపును, మన్ననలను పొందుతారు. తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందిని కలిగిస్తాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పా)
శుభ ప్రయత్నాలు ప్రోత్సాహాన్నిస్తాయి. ఫలిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు తగ్గిపోతాయి. మీ సలహాలు ఎదుటి వారికి ఉపకరిస్తాయి. వ్యవహారాలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. పనులు నెమ్మదిగా పూర్తవుతాయి. కీలక పత్రాలు లభ్యమవుతాయి. అనుకూలమైన మార్పులుంటాయి. ఆరోగ్య నియమాలను పాటించండి. స్పెక్యులేషన్ స్వల్పం. దంపతులు నమ్మకంతో ఒకే మాటతో ఉండాలి. విదేశీ యత్నాలు, కోర్టు వ్యవహారాల పరిష్కారాలు ఒనగూడుతాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా, శ్రవణం, ధనిష్ట 1, 2 పా)
ఆర్థిక విషయాలు ఆలోచింపజేస్తాయి. శుభకార్యాలు కలసి వస్తాయి. సమాజంలో మీకు అనుకూల వాతావరణం ఉంటుంది. ప్రతికూల పరిస్థితులను సానుకూలంగా మలచుకోండి. పుణ్య కార్యాలకై చేసే ప్రయత్నాలు కలసి వస్తాయి. కుటుంబంలో సఖ్యత ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు వద్దు. రావలసిన బకాయిలు ఆలస్యంగానైనా అందుతాయి.

కుంభం (్ధనిష్ట 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా)
అనుకూల వాతావరణం. శాంతికై ఆలోచించండి. విజయసిద్ధి. సౌఖ్య ప్రాప్తి. ఆదాయ వృద్ధి ఉంటుంది. ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపిస్తారు. అనుకున్న కార్యాలు నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు సంతోషపరుస్తాయి. తత్తరపాటుతనం విడనాడండి. స్పెక్యులేషన్ మిశ్రమం. గృహ మార్పులుంటాయి. ఆర్థిక తృప్తి. ప్రతికూల వాతావరణాన్ని నెమ్మదిగా పరిష్కరించుకుంటారు.

మీనం (పూర్వాభాద్ర 4వ పా, ఉత్తరాభాద్ర, రేవతి)
గౌరవ మన్ననలు అందుకుంటారు. కోపతాపాలొద్దు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్య విషయాలలో ఆసక్తి పెరుగుతుంది. పెట్టుబడులు, రాబడి సమానతలు పాటించండి. కుటుంబంలో ముఖ్యుల ఆరోగ్యం మిమ్మల్ని కలవరపరుస్తుంది. హితులు సాయపడతారు. శత్రువులపై విజయం. పైకం వ్యవహారాలు అనుకూలం. లౌక్యంతో మెలగండి.

ఎ.సి.ఎం. వత్సల్, 93911 37855