S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఏనుగు పిల్లలు ఏం చేస్తాయో తెలుసా?

భూమీద జీవిస్తున్న అతిపెద్ద క్షీరదం ఏనుగు. ఇప్పటికి మూడు జాతుల ఏనుగులు మాత్రమే బతికి ఉన్నాయి. భారతీయ ఏనుగుల చెవులు మిగతా జాతుల ఏనుగుల చెవులకన్నా చిన్నవిగా ఉంటాయి. మనలో చిన్నపిల్లలు నిద్రపోతున్నడ్లు, జోగుతున్నప్పుడు, ఆలోచనల్లో మునిగిపోయినప్పుడు నోట్లో వేలుపెట్టుకోవడం చూస్తునే ఉంటాం కదా! అలాగే గున్న ఏనుగులు తమ తొండాన్ని నోట్లో పెట్టుకుంటాయిట. ఏనుగుల గుంపునకు వాటిలో తెలివైన, వయసులో పెద్దదైన ఆడ ఏనుగు నాయకత్వం వహిస్తుంది. మగ ఏనుగులు వేరేగా గుంపుగా ఉంటాయి. ఏనుగల చర్మం మందం ఒక అంగుళం మేరకు ఉంటుంది. అయినా అవి సూర్యరశ్మిని, వేడిని ఎక్కువగా తట్టుకోలేవు. అందుకే నిరంతరం చర్మాన్ని రక్షించుకునేందుకు అవి మట్టిని చల్లుకుంటూ ఉంటాయి. ఏనుగులు మనుషుల్లాగానే తమ ముఖాన్ని అద్దంలో చూసుకుని గుర్తుపడతాయంటే నమ్మాలి మరి. ఎన్నో మైళ్ల దూరంలో నీళ్లుంటే అవి గాలిలో వాసనను బట్టి గుర్తిస్తాయి. నేలపై అదురును బట్టి అవి సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటాయి.

- ఎస్.కె.కె. రవళి