S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అతడే... ఓ అయస్కాంతం(లోకం పోకడ)

మనలో చాలా మందికి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. కొందరు బాగా పాడగలరు. మరి కొందరు బాగా మాట్లాడగలరు. ఇంకొందరు బాగా చిత్రాలు గీయగలరు. దేవుడిచ్చిన ఇటువంటి క్వాలిటీస్‌ని కొద్దిగా సాధన చేసి చాలా మంది ప్రముఖంగా పేరు తెచ్చుకుంటారు. మధ్యప్రదేశ్‌కి చెందిన అరుణ్ రైక్వార్ కూడా అందరినీ ఆశ్చర్యపరిచే ఒక ప్రత్యేకత కలిగిన వ్యక్తే. ముప్పై ఏడేళ్ల అరుణ్ శరీరంలోని గుండె, పొట్ట, వీపు భాగంలో ఇనుప వస్తువులు పెడితే ఇక అక్కడి నుండి కింద పడమన్నా పడవు అవి. ఎందుకంటే అతని శరీరం అయస్కాంత శక్తిని కలిగి ఉండడమే దీనికి కారణం. అయితే అతనికి తనలోని ప్రత్యేకత గురించి ఈ మధ్యే తెలిసింది. అతను కొన్నాళ్ల కిందట తన వంటిని అతుక్కున్న ఒక స్పూన్‌ని చూసి దానిని తొలగించాలని అనుకున్నాడు. అయితే మామూలుగా అది అతని శరీరాన్ని వదలలేదు. కొంత శ్రమ తర్వాత అది ఊడి వచ్చింది. అప్పుడే అరుణ్‌కి తన ప్రత్యేకత అర్ధమయింది. అది గమనించిన అరుణ్ తన శరీరంలోని అన్ని భాగాల్లో స్పూన్లు, మేకుల వంటి ఇనుప వస్తువులను ఉంచి అవి అతుక్కుంటున్నాయా లేదా అని గమనించడం మొదలుపెట్టాడు. అప్పుడు అతనికి తన శరీరంలోని గుండె, పొట్ట, వీపు భాగాల్లో ఆ వస్తువులను పెట్టినప్పుడు అవి అక్కడ అతుక్కుంటున్నట్లు గమనించాడు. ఇది విచిత్రంగాను, ఆనందించేదిగాను అనిపించినా తర్వాత ఇదేమైనా శారీరక లోపమా? తనకి ప్రమాదమా? అని అతను భయపడ్డాడు. ఈ విషయమే తెలుసుకోవడానికి డాక్టర్ దగ్గరకి పరిగెత్తాడు. అతన్ని అన్ని రకాలుగా పరీక్షించిన వైద్యుడు శైలేంద్ర శుక్లా అతనిలోని ఈ అయస్కాంత శక్తి వల్ల ఎలాంటి ప్రమాదం లేదని, ఈ శక్తి బహుశా కొన్నాళ్లకు పోయి అతను నార్మల్ అవుతాడని చెప్పాడు. అరుణ్ గురించి తెలుసుకున్న మధ్యప్రదేశ్ పేపర్లు, మీడియా అతని గురించి ప్రపంచానికి చాటి చెప్పాయి. అరుదైన ఈ శక్తి వల్ల అరుణ్‌ని మధ్యప్రదేశ్‌లోని వారంతా ఇండియన్ మేగ్నటిక్ మేన్ అని పిలవడం మొదలుపెట్టారు. ఇది తనకి సంతోషం కలిగిస్తుందని, వైద్యుడు చెప్పినట్లు ఈ శక్తి తనలో నుండి అదృశ్యమైపోయేలోగా తాను తన ప్రత్యేకమైన శక్తితో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో పేరు నమోదు చేసుకోవాలని భావిస్తున్నట్లు అతను చెబుతున్నాడు. అలా జరిగిన నాడు తన పిల్లలు, వారి పిల్లలు కూడా తన గురించి గొప్పగా చెప్పుకుంటారని అతను ఆశ పడుతున్నాడు.

- దుర్గాప్రసాద్ సర్కార్