S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

డాల్ఫిన్లు బహుమతులిస్తాయ్!( విజ్ఞానం)

మనలో ప్రేయసీప్రియుల మధ్య బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం మామూలే. ఒక్కోసారి విజేతలకు, పిల్లలకు పుట్టినరోజునో, పెద్దలకు పెళ్లిరోజనో ఏదో ఒక సందర్భంలో బహుమతులు ఇవ్వడం మనకు అలవాటే. యువతలో ఎక్కువమంది ప్రియురాలి ప్రేమను పొందడానికో, ప్రేమను తెలియజేయడానికో బహుమతులు ఇస్తూంటారు. అలాగే డాల్ఫిన్లు కూడా బహుమతుల మార్గాన్ని ఎంచుకుంటున్నాయని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా ఆడ డాల్ఫిన్ల తోడును, ప్రేమను పొందడానికి ఈ బహుమతులను మగ డాల్ఫిన్లు ఇస్తున్నాయట. ఆస్ట్రేలియాలోని హమ్‌పాక్ డాల్ఫిన్లు ఈ బహుమతులను ఇవ్వడం శాస్తవ్రేత్తలు గమనించారు. సముద్రజలాల్లో లభ్యమయ్యే ఒకరకమైన ‘స్పాంజ్’ను అవి పెద్దమొత్తంలో సేకరించి బహుమతి ఇస్తున్నాయట. అంతేకాకుండా జతకట్టదలచిన ఆడ డాల్ఫిన్ మనసు దోచేందుకు విభిన్నమైన, విచిత్రమైన విన్యాసాలు ప్రదర్శిస్తున్నాయట. తొలిసారిగా శాస్తవ్రేత్తలు ఈ విషయాన్ని గుర్తించడం విశేషం. వెస్టర్న్ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయం శాస్తవ్రేత్తల బృందం దాదాపు పదేళ్లుగా అధ్యయనం చేస్తోంది. పడవల్లో సముద్రాల్లో తిరుగుతూ వీరి పరిశోధన కొనసాగింది. ఆస్ట్రేలియా పశ్ఛిమ తీరంలో వీరు తమ పరిశోధనలు నిర్వహించారు. ఆస్ట్రేలియా హమ్‌పాక్ డాల్ఫిన్లలో మగవి ఆడవాటికి పెద్దమొత్తంలో స్పాంజ్‌లను బహుమతిగా ఇవ్వడాన్ని, ఆ తరువాత జతకట్టేందుకు ఆడవాటిని సమ్మోనహనపరిచేలా విన్యాసాలు ప్రదర్శించడాన్ని వీరు వీడియోలో చిత్రీకరించారుకూడా. అతిప్దెద స్పాంజ్‌లను అవి బహుమతిగా ఇవ్వడం వారు గమనించారు. హమ్‌పాక్ డాల్ఫిన్లు ఇలా ప్రవర్తించడాన్ని వారు తొలిసారిగా గుర్తించారు. ఒక మగ డాల్ఫిన్ తనకు నచ్చిన ఓ ఆడ డాల్ఫిన్‌కు, దాని చెంతనే ఉన్న ఒక పిల్ల డాల్ఫిన్‌కు ఇలా స్పాంజ్‌ను బహుమతిగా ఇవ్వడాన్ని మొదట చూశారు. ఆ తరువాత కొన్ని స్పాంజ్‌లను పడవ దిగువభాగంలో అమర్చారు. వాటిని గమనించిన మగ డాల్ఫిన్ ఊడదీసి ఆడ డాల్ఫిన్ చెంతకు చేరేలా ముక్కుతో పట్టుకుని తోయడాన్ని వారు గమనించారు. మనుషులు మినహా మిగతా జీవులు ఇలా శృంగారం కోసం వస్తువులను బహుమతులుగా ఇవ్వడం, సాధనాలుగా వాటిని ఉపయోగించుకోవడం చాలా అరుదు. తన సామర్థ్యాన్ని చాటుకునేందుకు అవి అలా ప్రవర్తిస్తూంటాయి. ‘హమ్‌పాక్ డాల్ఫిన్ల విచిత్ర ప్రవర్తనను గమనించాం. గడచిన పదేళ్లలో ఎన్నోసార్లు వాటిని పరీక్షించాం. ఇప్పుడు ఓ నిర్ణయానికి వచ్చాం. ఆడవాటిని ఆకర్షించేదుకు మగ డాల్ఫిన్లు బహుమతులు ఇవ్వడం, విన్యాసాల ప్రదర్శన చేయడం నిజమే’ననడానికి ఆధారాలు లభ్యమైనాయని శాస్తవ్రేత్త సైమన్ అలెన్ చెప్పారు. స్పాంజ్‌ను ఆహారానే్వషణకు వాడుకోకుండా ఇలా జతకట్టే భాగస్వామి కోసం ఉపయోగించుకోవడం, బహుమతిగా ఇవ్వడం విచిత్రమేనని, ఒక రకంగా ఇది ఆందోళనకర పరిణామమని ఆయన అంటున్నారు. రెండుచొప్పున పెద్దమగ హమ్‌పాక్ డాల్ఫిన్లు కలసికట్టుగా ‘బహుమతుల’ సేకరణకు పనిచేయడం కూడా వీరు గుర్తించామని మరో శాస్తవ్రేత్త స్టీఫెన్ కింగ్ చెప్పారు. అలా మగ డాల్ఫిన్లు సహకరించుకోవడం అసహజ పరిణామమని, శృంగారంలో అవి కలిసి పాల్గొనకపోయినా సహకరించుకోవడం వింత అని వారు పేర్కొంటున్నారు. భవిష్యత్‌లో పరిశోధనలకు ఇది ఊతమిస్తుందని వారు అంటున్నారు. జర్నల్ ఆఫ్ సైంటిఫిక్ రిపోర్ట్‌లో ఈ మేరకు పరిశోధనల ఫలితాన్ని ప్రకటించారు.

-ఎస్.కె.ఆర్.