S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బ్రతుకు పాఠం..!

నేర్చుకోవాలి నేను
జీవించే విధానం ఎలాగో
ఇంకా నేర్చుకోవాలి..!

జీవితంలో బ్రతకడం
ఎలాగో తెలుసుకోవాలి..!

నన్ను నేను మార్చుకుని
నాలోని నన్ను దానికి
అనుగుణంగా మలచుకోవాలి..!

లోకం పోకడ తెలుసుకుని
ఎలా మసలుకోవాలో
అర్థం చేసుకోవాలి..!

విషయాన్నీ వివరించే
సమర్థనీయత పెంచుకుని
సవాళ్లను ఎదుర్కోవాలి..!

నీతి రీతిగా నాలో
మమేకమైనా అనుకూల
పరిస్థితులను ఆశ్రయించాలి..!

ఎవరినో ఉద్ధరించటం
మానుకుని ముందు
నన్ను నేను తెలుసుకునే
ప్రయత్నం చేయాలి..!

నాలోని నన్ను
శోధించాలి..!
అంతరంగ అంతరార్థం
గ్రహించాలి..!
బ్రతుకు పాఠం ఇంకా
నేర్చుకోవాలి..!

-షేక్ నసీమా బేగమ్ 9603567011