S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అనుత్తీర్ణ ప్రశ్న

తిరుగుతున్నాను
తిరుగుతూ...నే ఉన్నాను
నేల నాలుగు చెఱగులా కొలిమలె
ఉడికిపోతున్నది మానవ సమాజం
క్రుళ్లిపోతున్నది మానవ నైజం
నింగినంటినాయి
నేల నుండి ఉవ్వెత్తున ఎగసిన జ్వాలలు.. స్వార్థ కీలలు
వ్యాపిస్తున్నాయి మూలమూలలా
పుచ్చులవలె.. కారుచిచ్చులవలె
అంతర్థానవౌతున్నారు విద్వాంసులు
అంతమే ‘అర్థులై’ దూసుకొస్తున్నారు విధ్వంసులు
ఇంతా చూస్తే..
అందరూ విద్యావంతులే.. విజ్ఞానవేత్తలే
క్రూరమృగాలలో సైతం
కనిపించదిది.. ప్రకృతి జీవుల నా..
ఇజాలలో నిజమెంత
ఇగోలలో ఇంగితముంటుందా..
తాను నమ్మినదే సిద్ధాంతం
లేకపోతే రాద్ధాంతం
స్వార్థానికి ముసుగు వృద్ధి అయితే
విశాలత్వాల లొసుగు వికారాలు
వైపరీత్యాల పరదా నాగరీకం
అపరాధాల తెర ఆధునీకం
అనబోతే దొరుకుతుంది కాలం.. తేరగా
మానవత్వం లేనినాడు
మానవ ప్రత్యేకతేముంది?
వినయంలేని రోజు
విద్యావేత్తలెందుకు?
సత్యగ్రాహ్యత లేనప్పుడు
సత్యాగ్రహాలెందుకు... సమరాలెందుకు?
బుద్ధిజీవుడవు ఐతే.. నీవు
భూమాతకెందుకీ కన్నీళ్లు..?

-ఎస్.హరిచందన్ 7396533837