S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

చావుకళ(కథ)

ప్రముఖ జ్యోతిష్కుడు విష్ణుశర్మకు ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. తన ఒంట్లోకి కొత్త శక్తి ప్రవేశించినట్టు ఆయనకు తోస్తోంది. ఆయన మెదడు నిండా కలగాపులగం వంటి ఆలోచనలు.
ఉదయం మంచం దిగుతూనే ఆయన అద్దం ముందు నిలబడి తన మొహాన్ని ఒకటి రెండుసార్లు చూసుకున్నాడు. ఆయనను భార్య విచిత్రంగా గమనిస్తోంది. ఆలోచనలతో కొట్టుమిట్టాడుతూ వీధి గుమ్మం వైపు కదిలాడు విష్ణుశర్మ.
రహదారి మీద కూరగాయల కావిడితో ఒక గ్రామస్థుడు వస్తూ కనిపించాడు. విష్ణుశర్మకు ఆ గ్రామస్థుడు ప్రతిరోజూ కనిపించేవాడే. అయితే ఈ రోజు అతడు విచిత్రంగా కనిపిస్తున్నాడు. అతడి తల వెనుక ఒక నల్లటి మబ్బు ఆవరించుకుని ఉన్నట్లు విష్ణుశర్మకు తోచింది.
కొంతసేపటికి నల్లటి మబ్బు ఒక రాక్షస ఆకారం ధరించింది.
విష్ణుశర్మకు తన మెదడులో ఎవరో దూరి, ‘మృత్యుదేవత’ అని చెప్పినట్టు అనిపించింది. తుళ్లిపడ్డాడు విష్ణుశర్మ. ఆ కూరగాయల వాడిని మృత్యుదేవత కబళించనుంది. ఈ విషయం తనకు ఎలా తెలుస్తోంది?
ఎటు నుండి దూసుకుంటూ వచ్చిందో ఒక గుర్రపు బగ్గీ అతివేగంగా వచ్చింది. విష్ణుశర్మ కన్ను మూసి తెరచేటంతలో కూరగాయల కావిడి గాల్లోకి ఎగిరింది. గ్రామస్థుడు బగ్గీ చక్రాల కింద పడ్డాడు. కొన్ని క్షణాల్లోనే గిలగిల తన్నుకుని అతడు మరణించాడు.
విష్ణుశర్మకు కాళ్లూ చేతులూ ఆడలేదు. తనకు అబ్బిన శక్తి ఏమిటో ఆ ప్రముఖ జ్యోతిష్కుడికి ఎవరూ చెప్పనవసరం లేకపోయింది.
గుర్రపు బగ్గీ ఆయ ఇంటి ముందే ఆగింది. ఆయనను తీసుకు పోవడానికి జమీందారు పంపించగా వచ్చింది గుర్రపు బగ్గీ. బగ్గీని నడుపుతున్న వాడు గజగజ వణుకుతున్నాడు. తన మూలంగా కూరగాయల వాడు మరణించాడని అతడి ఆవేదన.
‘నీ తప్పు లేదు. వాడిని మృత్యుదేవత ఎత్తుకుపోయింది. అయినప్పటికీ జమీందారుగారికి చెప్పి, వాడి కుటుంబానికి తగిన ఆధారం ఏర్పాటు చేయిద్దాం’ అన్నాడు విష్ణుశర్మ.
విష్ణుశర్మ ప్రతిపాదనకు జమీందారు సులువుగానే ఆమోదించాడు. కూరగాయల వాడి కొడుకుకు తన పండ్ల తోటలో ఉద్యోగం కల్పించాడు జమీందారు.
జమీందారుగారి తల్లి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. తన తల్లి ఎంతకాలం బతికి ఉంటుందో తెలుపవలసిందిగా విష్ణుశర్మను కోరాడు జమీందారు.
మరో రెండు సంవత్సరాల వరకు ముసలావిడ ఒక గుండ్రాయిలాగా తిరుగుతుందని జోస్యం చెప్పాడు విష్ణుశర్మ. అంతే! మంచం మీద నుండి లేచి కూర్చుంది ముసలావిడ. ఆమె శరీరంలోకి ఎక్కడలేని జవసత్వాలు వచ్చి చేరుకున్నాయి.
పొంగిపోయాడు జమీందారు. విష్ణుశర్మను ఘనంగా సత్కరించాడు. తిరుగు ప్రయాణంలో గుర్రపు బగ్గీ ప్రయాణం ఆయనను ఇబ్బంది పెట్టింది. కూరగాయల కావిడిని బగ్గీ ఢీకొట్టినప్పుడు చక్రం ఇరుసు దెబ్బతిన్నది.
విష్ణుశర్మను అడవి మార్గంలో విడిచిపెట్టాడు బగ్గీ నడిపేవాడు. నడక పుచ్చుకున్నాడు విష్ణుశర్మ. కొద్దిసేపు ఆయన నడిచాడో లేదో ఆయన నడక ఆగిపోయింది. ఆయన పాదాలు నేలలో పాతుకు పోయినట్టయ్యాయి.
ఆయన కళ్ల ఎదుటే ఒక సింహం నిలబడి ఉంది. విష్ణుశర్మ మీద దాడి చేసి ఆయనను కబళించడానికి సింహం సిద్ధంగా ఉంది. ఆయనకు పై ప్రాణాలు పైనే పోయాయి.
ఆయనకు మరో ముప్పై రెండేళ్లపాటు బతికి ఉండేటట్టు జాతకం ఉంది. మరి ఈ అకాల మృత్యువు ఏమిటి?
భయం తగ్గించుకుని సింహాన్ని పరిశీలనగా చూస్తూండిపోయాడు విష్ణుశర్మ. ఆయన కళ్లు మెరిశాయి. సింహం శిరస్సు వెనుక మృత్యుదేవత మొహం అచ్చగా నల్ల మబ్బు మాదిరిగా ఆవరించుకుపోయి ఉంది.
కొన్ని క్షణాల్లో సింహం చావనున్నది. ఎలా చచ్చిపోతుంది? సింహం తల మీద ఒక బండి చక్రం బరువుగా పడింది. సింహం తల పగిలిపోయింది.
విష్ణుశర్మను వెతుక్కుంటూ వచ్చిన బండివాడి చేతిలో సింహానికి చావు మూడింది.

-బి.మాన్‌సింగ్ నాయక్