S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రామసేతు కోతకు వామపక్షపు వకాల్తా

‘తమ కార్యంబు పరిత్యజించియు పరార్థ ప్రాపకుల్ సజ్జనుల్,
తమ కార్యంబు ఘటించుచున్ పరహితార్థ వ్యాపృతుల్ మధ్యముల్,
తమకై అన్య హితార్థ ఘాతుక జనుల్ దైత్యుల్’
అన్నాడు భర్తృహరి..
శ్రీలంక-్భరత్‌ల మధ్య ఉన్న ‘రామసేతు’ ఏడు వేల సంవత్సరాల కిందటి మానవ నిర్మిత వారధి అని తమతమ నిశిత విస్తృత పరిశోధనలలో తేలిందని అమెరికాకు చెందిన సైన్స్ ఛానెల్ ఇచ్చిన సమాచారంపై ఓ టెలివిజన్ ఛానెల్‌లో చర్చాగోష్టి ఇటీవల జరిగింది. సైన్స్ ఛానల్ ఇచ్చిన సమాచారాన్ని ముందు ప్రసారం చేసి దానిపై ముగ్గురి చేత మాట్లాడించారు. ‘రామసేతును 300 మీటర్ల మేర కూలగొట్టాలి. అలా చేసినందువల్ల నౌకల ప్రయాణ కాలం చాలా రోజులు కలసివస్తుంది. తూర్పు, పశ్ఛిమ దిశల నుంచి వచ్చే నౌకలు శ్రీలంకను చుట్టి తమిళనాడులోని నౌకాశ్రయాలను చేరుకోవలసి రావడంలోని అధిక శ్రమ తగ్గిపోతుంది. ఇంధనం పొదుపవుతుంది. ఖర్చు గణనీయంగా కలిసొస్తుంది. ఈ ప్రయోజనాల దృష్ట్యా రామసేతు కొంత మేర కోసేసి, ధ్వంసం చేసినంత మాత్రాన వచ్చే నష్టమేమీ లేదు’ అంటూ అందులో ఇద్దరు వామపక్ష భావజాలపు కైపులో మాట్లాడారు. డిఎమ్‌కె పార్టీ, నిన్నటి యుపిఏ ప్రభుత్వాల వాదన కూడా అదే. ఇక కమ్యూనిస్టుల సంగతి చెప్పనే అక్కరలేదు. భారతీయ నాగరికత సాంస్కృతిక వారసత్వ చిహ్నాల విధ్వంసం అంటే వారికి పసందైన విందు.
అయితే ఈ పురాతన పురాణ కాలపు వంతెనను కొంతమేరైనా ధ్వంసం చేయడం కూడని పని అనే కొందరు జాతీయవాదుల అభ్యంతరం మీద వివాద విచారణ న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉంది. ఇది ఏదో కొన్ని కోట్ల రూపాయల ఆదా, కొద్ది రోజుల ప్రయాణ శ్రమ తగ్గింపు, ప్రపంచ దేశాల ఇంధనపు ఖర్చులో ఒక శాతం కూడా కాని పొదుపు - ఇందులో ఏ ఒక్కటీకాదు ఇక్కడ గరిమనాభిలాంటి ప్రధాన అంశం.
రామసేతులో కోత కోటానుకోట్ల భారత జాతీయవాదుల గుండెకు కోత. అసలు స్మారకాలు, మాన్యుమెంట్లు, మ్యూజియములు, ప్రపంచ అద్భుతాలు వగైరాలన్నింటినీ ఎందుకోసం ప్రపంచంలోని ప్రతి దేశమూ తన గడ్డమీద కాపాడుకుంటూ వస్తోంది? ఇదంతా ఏ దేశానికి ఆ దేశపు జాతి జనుల జాతీయ స్పృహానుభూతల సజీవత కోసం, నిరవధిక అస్తిత్వం కోసం, ‘నిన్నటి’ నుంచి వర్తమానంలో జాతి పొందాల్సిన చారిత్రక స్ఫూర్తి కోసం, రేపటి కోసం.
ఇలాంటి మహోదాత్త స్ఫూర్తితోనే పాశ్చాత్య కవి వాల్టర్ స్కాట్ యొక్క చిరస్మరణీయ ‘పేట్రియాటిజం’ పద్యం సాగిపోయింది. ఫ్రెంట్‌లో ఫ్రాంకోయిస్ విలాస్, ఇంగ్లీషులో డాంటే గేబ్రిటల్ రోసెట్టీల ‘జ్దీళూళ ఘూళ ఆ్దళ ఒశ్యతీఒ యచి కళఒఆళూ కళ్ఘూ’ అన్న కవితలో రక్త నిష్ఠమైన దేశాభిమానం వెల్లివిరిసింది.
‘‘కాళిదాస మహాకవీంద్రుని కవన వాహినిలో కరంగిన ఉజ్జయిని’, ఝాన్సి లక్ష్మీదేవి యెక్కిన సైంధవం’, ‘కృష్ణరాయని బాహుజాగ్రద్బాడబాగ్నులు’’ - వీటి గుఱించి ఒకనాడు శ్రీశ్రీ పలవరించాడు. ‘‘ఏవి తల్లీ! నిరుడు కురిసిన హిమ సమూహములు’ అంటూ ప్రారంభమయ్యే తన అనుభూతి ప్రధాన కవితలో. ఆ కవిత భారతీయ సాంస్కృతిక పరంపరాగత చిహ్నాల ప్రస్తావనలో జనానికి కొత్త ఊపిరిలూదింది గత శతాబ్దపు ఒక దశాబ్దంలో.
అంతకుముందు స్వామి వివేకానందకైతే కన్యాకుమారిలోని ఒక కఠిన శిలాధివాసం కూడా విరాడ్రూప భారతమాత్రాకార మనోహర దృశ్యాలోకన అనుభూతిని అందించింది, ఒక జాతీయతా స్ఫూర్తిని రగిలించింది. రామాయణం, రాముడు, వారధి మీద వారధి - ఈ అంశాల భారతీయ సాంస్కృతిక స్పృహలో విడదీయరాని అంతర్భాగ అంశాలు. వాటిమీద దెబ్బకొట్టాలని అనుకోవడమే అవుతుంది రామసేతును ఛిద్రం చేసే యత్నం చేస్తే. ప్రపంచంలో ఏ దేశంలోనూ సాంస్కృతిక, భౌగోళిక, చరిత్ర సంబంధ వారసత్వాలను చెరిపే, చెరిచే పని ఎక్కడా జరగలేదు, జరగదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఏ ఇజాల మోజులో ఏ దొరతనం దోగినా, తూగినా.. భౌతిక వాదులకు, నాస్తికులకు డబ్బు - సంపదలే ముఖ్యం కావచ్చు. అంతమాత్రం చేత మన దేశంతోపాటు దేశదేశాల్లోని చారిత్రక కట్టడాలను, అద్భుతాలను కూల్చివేద్దాం - లేక కొంత వఱకు రూపు మాపేద్దాం, ఆ అదనపు స్థలాలలో ఇళ్లు కట్టి పేదలకు ఇద్దామనడం తుగ్లక్ తరహా చర్యలకు, ఊహలకు, కార్యాచరణకు సిద్ధం అవుదామా? అవగలమా?
రష్యాలోని సెయింట్ పీటర్ అండ్ పాల్ క్యాథడ్రల్, నీవానదీ తీరపు హెర్మిటేజ్ పీటరాఫ్ ప్యాలెస్ వగైరాలను, చైనాలోని కుఫు కన్‌ఫ్యూసియస్ దేవాలయం, పెషియల్ స్ట్రక్చర్, సమ్మర్ ప్యాలెస్, మగావో గుహలు మొదలైన వాటిని, హైదరాబాద్‌లో కుతుబ్‌షాహి సమాధులను, ఢిల్లీలోని మొగలాయిల ఎఱ్ఱకోటను - ఇలాంటి వేలకొలది వారసత్వ చిహ్న సంపదలను కూల్చివేస్తే ఎందరికో కూడు-గూడు-గుడ్డ సాధించిపెట్టే పరిశ్రమలు స్థాపించవచ్చని, తంజావూర్ బృహదీశ్వరాలయం, వరంగల్ జిల్లాలోని రామప్పగుడి మొదలైన ప్రసిద్ధ దేవాలయాల చుట్టూ ఉన్న వేల ఎకరాల ఖాళీ స్థలాలను భిన్నభిన్న ప్రజాప్రయోజనాలకు, ఉపయోగాలకు అంకితం చేద్దామని ఆలోచిద్దామా? దీనికి అర్థం ఉందా?
ఏ నాగరిక ప్రభుత్వం గాని, ఏ ప్రజాస్వామ్యపు ఏలుబడిగాని తాతలనాటి అద్భుతాలను పాతాళానికి అణగదొక్కాలని అనుకోదు. జాతీయాదాయం పెంచుకోవడానికి, దేశపు ఖర్చు తగ్గించుకోవడానికి ‘రామసేతు కోత’ సముచిత మార్గం అనుకుంటే అంతకంటే రాక్షస ప్రవృత్తి పూర్వకపు పూనిక మరొకటుండదు.
కాలు బయటపెడుతుంటే గడప కాలికి అడ్డంగా ఉన్నదని, గడపనే కాల్చిపారేయాలనుకుంటే ఇల్లే తగలబడుతుంది క్రమంగా రగిలే అగ్గి సెగలు, పొగలతో. నౌకల రాకపోకలకు అడ్డంగా ఉన్నదని, వారధిని విరిచేస్తే ఇన్నాళ్లుగా అక్కడ - అంటే - ఆ ప్రత్యేక స్థానంలో ఉన్న సముద్ర జలాల సమతౌల్యము, ఆటుపోటుల నిలకడ, ప్లవన శాస్త్ర సంబంధ స్థిరీకృత సాపేక్షిక ప్రమాణాలు ఛిన్నాభిన్నమవుతాయి. ప్లవనగుణ సాపేక్ష సాంద్రత (relative intensity and density of buoyancy) మారిపోయి సునామీలాంటి ఒక ఉపద్రవానికి దారితీస్తుంది. ఈ విషయం ‘నాసా’, సాగర జలస్థితి-గతి శాస్తవ్రేత్తలు (Oceanographists) ఇఫ్పటికే కొన్నిసార్లు చెప్పి ఉన్నారు.
మనదేశంలో వామపక్ష భావజాలాల వారు మొదట్నించి ఇక్కడి ప్రాచీన చరిత్ర - సాంస్కృతిక సంబంధ జాతీయ స్పృహలకు వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారు. రామాయణ భారతాలు పుక్కటి పురాణాలన్నారు. రామాయణం ఱంకు, భారతం బొంకుఅన్నారు. ‘రాముడు’ ఊహాసృష్టి అన్నారు. పురాణాలు, ప్రాచీన కావ్యాలు అన్నీ చెత్త అన్నారు. ఇప్పుడు రామవారధి నూటికి నూరుపాళ్లు ప్రాచీన భారతీయులు ఏడువేల ఏండ్లనాడు నిర్మించినదే అని ఋజువులతో సహా వెల్లడయ్యేసరికి కమ్యూనిస్టులకు, ప్రచ్ఛన్న కమ్యూనిస్టులైన చాలామంది కాంగ్రెసు నాయకులకు గొంతులో కరక్కాయ పడ్డది. భారతీయుల చిరంతర స్పృహ, స్మృతి అదృశ్యమైపోవాలని వారు తీసుకున్న ఎన్నో కుహనాలౌకికవాద చర్యల్లో రామసేతు కోత ప్రతిపాదన ఒకటి. ఇలాంటి కిరాతక కృత్యాలను నిత్యవిధిగా మార్చుకున్న వర్గాలకు టీవీలోని చర్చాగోష్ఠి ఓ ఆహ్లాద దృశ్యం. కానీ అది జాతీయవాదుల పాలిట ఒక కవ్వింపు. అకుంఠిత దేశభక్తికి ఒక వెక్కిరింత.

-శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం