S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

చిన్నారిదేవత ( అవీ..ఇవీ )

థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో ఓ షాపు యజమాని ఈ అందమైన బొమ్మను షోకేస్‌లో పెట్టాడు. ఈ బొమ్మవల్ల అదృష్టం కలసివస్తుందని అతడి విశ్వాసం. ఆ దేశంలో ఇప్పుడు ఈ తరహా బొమ్మలకు గిరాకీ ఏర్పడింది. రాజకీయ, ఆర్థిక అస్థిరతతో కొట్టుమిట్టాడుతున్న ఆ దేశంలో చాలామంది ఇప్పుడు ఇలా అదృష్టం తమ తలుపు తట్టాలని చేయని ప్రయత్నం లేదు.

అమ్మ..అక్క...నేను
ఈ మధ్య ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేసిన ఈ ఫోటోలో తల్లి, ఇద్దరు కవలపిల్లలు ఉన్నారు. ఇందులో గొప్పేంటి అంటే కుదరదు. ఈ ముగ్గురిలో తల్లెవరో చెప్పుకోండి చూద్దాం. ఖచ్చితంగా చెప్పడం కాస్త కష్టమైన పనే. ఇడియానాపోలిస్ (అమెరికా)కు చెందిన కేలెన్ మహోమిస్ అనే మహిళ తన ఇద్దరు కవల కుమార్తెలతో కారులో వెళుతూండగా ఓ కూతురు ఇలా సెల్ఫీ తీసింది. ‘అమ్మ, నా కవల సోదరి..నేను’ అన్న కాప్షన్‌తో ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. అంతే..30వేల లైక్‌లు, 19వేల రీట్వీట్‌లు రావడంతో వారు ఉబ్బితబ్బిబ్బయ్యారు.

ఎక్కడైతేనేం...
ట్రక్ డ్రైవర్లకు ఎప్పుడు తీరిక ఉంటుందో చెప్పలేం. ఎందుకంటే నిర్ణీత సమయానికి సరకు రవాణా చేయకపోతే నష్టపోవల్సివస్తుంది. అందుకే ఎక్కడ వీలుదొరికితే అక్కడే సొంత పనులు చక్కబెట్టుకోవాలి. ముంబైలో ఓ ట్రక్ డ్రైవర్ ఇలా రోడ్డుపక్కనే హెయిర్‌కట్ చేయించుకున్నాడు. కాస్త శుభ్రంగా ఉంటేచాలు..క్షవరం చేయించుకోవాలి...టౌన్‌లోనే చేయించుకోవాలంటే అంత తీరికేదీ అంటున్నాడు.

ఇదీ జంతుప్రేమ

వన్యప్రాణులను రక్షించమని చాలామంది చెబుతారు. కానీ అమలు చేయమంటేనే చిక్కొస్తుంది. కానీ చైనాలోని సాన్యా థీమ్‌పార్క్‌లో మాత్రం జంతుప్రేమికులు నిజంగానే వాటి సంరక్షణకు ప్రయత్నిస్తున్నారు. జూలో ఉన్న జంతువుల మాదిరిగా శరీరంపై పెయింటింగ్ వేసుకుని వాటికి ఆహారాన్ని అందిస్తూంటారు. జూ చూడటానికి వచ్చేవారికి జంతురక్షణపై ఇలా చైతన్యం కలిగిస్తున్నారన్నమాట. సాన్యాలోని థీమ్‌పార్కుల్లో ఇలా పదిమంది పనిచేస్తున్నారు. సాన్యాలోని సంగ్‌చెంగ్ థీమ్‌పార్క్‌లో ఓ మహిళ ఇలా జిరాఫీలా బాడీపెయింటింగ్ వేసుకున్న దృశ్యం చూపరులకు ఆసక్తి కలిగించింది.

కోతికి
కాస్ట్యూమ్

చైనాలో ఇప్పుడు కొత్త సంవత్సరం ప్రారంభమైంది. ఈ సంవత్సరాన్ని ‘మంకీ’ ఇయర్‌గా పిలుస్తారు. ఈమధ్యే కొత్త సంవత్సర వేడుకలు ప్రారంభమయ్యాయి. అందుకే ఇలా కోతికి కొత్తబట్టలు కట్టారు. ఇక కోతుల మాదిరిగా తయారైన దుస్తులతో చిన్నారుల ఆటలకు అంతేలేదు.

-బారతి