S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆలోచన (కథ)

రామనాథానికి ఇద్దరు కొడుకులు శ్యామ్, రామ్. చిన్న కొడుకు రామ్ చాలా తెలివి, ధైర్యం కలవాడు. రామనాథం ఒక రామచిలుకను పెంచుకుంటున్నాడు. దానికి బోలెడన్ని మాటలు నేర్పించాడు. దానిని పంజరంలో బంధించి ఉంచడం ఇష్టంలేక స్వేచ్ఛగా వదలివేశాడు. రామనాథం మంచితనం నచ్చి అది అప్పుడప్పుడూ వచ్చి రామనాథానికి తన చిలుక పలుకులు వినిపించి వెళ్లేది.
ఇలా ఉండగా, ఆ ఊరికి ఒక రాక్షసుడు మనిషి రూపంలో వచ్చాడు. వాడు ఆకలికి తాళలేక, జంతువులనే కాదు, మనుషులను కూడా రహస్యం తినటం మొదలుపెట్టాడు.
ఒకరోజు రామనాథం పెద్ద కొడుకు శ్యామ్ పనుండి పక్క ఊరికి వెళ్లాడు. జన సంచారం లేని ఒక దారిలో పెద్ద మర్రిచెట్టు కింద రాక్షసుడు మనిషి రూపంలో కూర్చుని ఉన్నాడు. ఆకలితో ఉన్న ఆ రాక్షసుడు రామనాథం కొడుకు శ్యామ్‌ని పట్టుకుని, నోట్లో వేసుకొని గుటుక్కున మింగేశాడు.
ఆ సంఘటనని అప్పుడే అక్కడికి వచ్చిన రామనాథం పెంపుడు రామచిలుక చూసింది. ఇక ఆలస్యం చెయ్యలేదు. ఎగురుకుంటూ వెళ్లి రామనాథంతో విషయమంతా చెప్పింది. రామనాథానికి ఏం చేయాలో పాలుపోలేదు. కొడుకు శ్యామ్‌ని ఎలా రక్షించుకోవాలో తెలీలేదు. రామనాథం కుటుంబం పెద్దపెట్టున ఏడ్వటం మొదలుపెట్టింది.
ఈ సంగతి తెలిసిన రామ్ ‘నాన్నా! నీవు భయపడకు. ఆ రాక్షసుణ్ణి చంపి అన్నను తీసుకువస్తాను’ అని చెప్పాడు.
‘వద్దురా.. ఆ రాక్షసుడు నిన్ను కూడా మింగుతాడు.’ అని తండ్రి రామనాథం భయపడుతూ రామ్‌ని బుజ్జగించాడు.
‘నాకేం కాదు. వాడు మనుషుల్ని, జంతువుల్ని మింగుతున్నాడు, నమలడం లేదని రామచిలుక చెప్పింది. ఇదిగో ఈ కత్తితో వాడి పొట్టను చీరేస్తాను...’ అంటూ రామ్ తన చొక్కా కింద పదునైన కత్తి బయటకు కనపడకుండా పెట్టుకుని పరుగు పరుగున రాక్షసుడున్న చోటుకి వెళ్లాడు - రామచిలుక దారి చూపుతూ ఉండగా.
రాక్షసుడు రామ్‌ని కూడా పట్టుకొని గబుక్కున మింగేశాడు. అంతే! రామ్ నేరుగా రాక్షసుడి కడుపులో పడ్డాడు. తన అన్న శ్యామ్ రాక్షసుడి కడుపులో స్పృహ తప్పిపడి ఉండటం వాడు గమనించాడు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా, కత్తితో రాక్షసుడి కడుపును చీరేశాడు. దీంతో పెద్దపెద్ద హాహాకారాలతో రాక్షసుడు గిలగిలా తన్నుకుని చచ్చాడు. చీలిన కడుపులో నుండి అన్న శ్యామ్‌ను తీసుకుని, తమ్ముడు రామ్ బయటపడ్డాడు. ఈ లోపల రామచిలుక రామనాథం దగ్గరికి వెళ్లి రాక్షసుణ్ని రామ్ చంపివేశాడని చెప్పింది.
రామనాథం గ్రామస్థులను తీసుకొని మరణించిన రాక్షసుడి దగ్గరకు వచ్చాడు. రాక్షసుడి పీడను వదిలించినందుకు రామ్‌ని అభినందించారు.

-కంచనపల్లి వేంకట కృష్ణారావు