S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నాటి పాండవుల ఆవాసం పుణ్యగిరి క్షేత్రం

ఎతె్తైన కొండలు... గలగల పారే జలపాతాలు... ఆహ్లాదపరిచే వనసంపద.. మధ్యలో పరమేశ్వరుడు ఉమా కోటిలింగేశ్వరునిగా వెలిశాడని ప్రతీతి. దక్షిణ కాశీగా పేరుగాంచిన ఈ ఆలయం విజయనగరం జిల్లా ఎస్.కోటకు సమీపంలో ఉంది. పూర్వం రుషులు తపస్సు చేసి పరమేశ్వరుని సాక్షాత్కారం పొందారు. అనంతరం ఇక్కడ శివుడు లింగరూపంలో ఆవిర్భవించాడని పూర్వీకుల కథనం.
ఉత్తరాంధ్రలో పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఉమాకోటిలింగేశ్వరస్వామి ఆలయం ఒకటి. ఈ క్షేత్రానికి మహాభారత కాలానికి సంబంధం ఉందని పౌరాణిక గాథల వల్ల తెలుస్తోంది. అలనాటి పాండవుల ఆవాసమే ఈ పుణ్యగిరి క్షేత్రం. మహాభారత కాలంలో పాండవులు జూదమాడి కౌరవుల చేతిలో ఓడిపోయి 13 ఏళ్ళు అరణ్యవాసం, ఒక ఏడు అజ్ఞాతవాసం చేశారు. పాండవులు అరణ్యవాసం ముగించుకొని అజ్ఞాతవాసం ఈ ప్రాంతంలోనే చేశారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక్కడ విరాట్‌రాజు కొలువు ఉండేదని, ఆ కొలువులోనే పాండవులు అజ్ఞాతవాసం గడిపారని పౌరాణిక గాథల వల్ల తెలుస్తుంది. ఆ సమయంలో పాండవులు ప్రతి రోజూ ఇక్కడ జలధారలలో స్నానమాచరించి, పరమేశ్వరుని ఆరాధించేవారని భక్తుల విశ్వాసం. శివరాత్రికి ఈ ప్రాంతమంతా శివనామ స్మరణతో మార్మోగిపోతుంది.
పుణ్యగిరి క్షేత్రంలో వెలసిన కోటిలింగాలు, త్రినాథ గుహ, ధారగంగమ్మ జలపాతం ప్రసిద్ధి చెందిన దర్శనీయ స్థలాలు. పుణ్యగిరికి అ యిదు కిలోమీటర్ల దూ రంలో ఉన్న ఈ కొండపై విరాట్‌రాజుల కొలువులో పాండవులు నివసించేవారని పురాణాలు తెలుపుతున్నాయి. ఆ సమయంలో వారు పుట్ట ద్వా రా వచ్చే జలపాతంలో స్నానమాచరించేవారని భక్తుల విశ్వాసం. ఈ క్షేత్రంలోని శివలింగాన్ని తాకుతూ వచ్చే ఈ పుట్ట్ధుర ఎక్కడి నుంచి వస్తుందో నేటికీ అంతుపట్టడం లేదు. పురాణ గాథ ప్రకారం విరాట్ రాజు బావమరిది కీచకుడు కాముకత్వంతో మారువేషంలో ఉన్న ద్రౌపదిని కోరుకుంటాడు. ఆ కారణంగా భీముని చేతిలో మరణిస్తాడు. దీంతో విరాట్‌రాజు సోదరి సుధేష్ణదేవి అపరిమితంగా విలపించడంతో ఆమె ఇష్టదైవమైన పరమేశ్వరుడు తన జటాజూటం విసిరి ధా రగా జలాన్ని పుట్టించాడని పౌరాణిక గాథ. ఆ ధారలో స్నానం చేసి తనను ఆరాధించినట్టయితే ఆమె శోకం ఉపశమిస్తుందని పరమేశ్వరుడు చెబుతాడు. సుధేష్ణదేవి ఆ విధంగా చేయడంతో ఆ ధార పుట్ట్ధురగా వచ్చింది. ధారగంగమ్మ భక్తుల కోర్కెలను ఈడేర్చే తల్లిగా ఈ ప్రాంత ప్రజల నీరాజనాలు అందుకొంటోంది.
1945లో ఒక చిన్న మందిరంగా ఏర్పడిన ఈ ఆలయం నేడు సకల సౌకర్యాలతో భక్తులకు కనువిందు చేస్తోంది. మహా శివరాత్రి రోజున జలధారల కింద స్నానాలు చేసి పరమేశ్వరుని దర్శించుకొని జాగరణ చేసినట్టయితే సర్వపాపాలు తొలగిపోవడమేగాకుండా కైలాస ప్రాప్తి లభిస్తుందన్నది భక్తుల నమ్మకం. ఇక్కడ మరో విశిష్టత... అస్తిక మండపం. ఇక్కడ శివలింగాలు ఊర్ధ్వ ముఖంలో ఉంటాయి. పై నుంచి నీరు నిరంతరం ప్రవహిస్తోంది. చనిపోయిన వారి అస్తికలను నిమజ్జనం చేసి పితృ కార్యాలు చేస్తుంటారు. ఈ విధంగా పుణ్యగిరి క్షేత్రం ప్రసిద్ధిగాంచింది. ఈ ఆలయానికి ఏటా రూ. 28 లక్షల ఆదాయం సమకూరుతోంది. ఒక్క శివరాత్రి రోజున సుమారు రూ.11 లక్షల ఆదాయం లభిస్తుంది. ఈ క్షేత్రానికి ఉత్తరాంధ్ర ప్రజలతోపాటు ఒడిశా, తెలంగాణ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేస్తుంటారు. పర్యాటక ప్రాంతంగా కూడా ఈ క్షేత్రం అలరారుతోంది.
ఎలా వెళ్ళాలి?
పుణ్యగిరిని దర్శించుకునేందుకు విశాఖపట్నం, విజయనగరం జిల్లాల నుంచి ఎస్.కోట వరకు బస్సు సౌకర్యం ఉంది. అక్కడ నుంచి ఆటోలో వెళ్ళవచ్చు. విశాఖపట్నం నుంచి 70 కిమీ, విజయనగరం నుంచి 23 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. ఆర్టీసీ సంస్థ ప్రతి అర్ధగంటకు బస్సు సౌకర్యం కల్పించింది.

-బొండా రామకృష్ణ