S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రాచీన చరిత్రకు సాక్ష్యం దుబ్బ రాజేశ్వరాలయం

భక్తులు కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా స్వయంభూ దైవమైన శ్రీరాజరాజేశ్వర స్వామికి పేరుంది. జగిత్యాల జిల్లాలోని సారంగాపూర్ మండలంలోని దట్టమైన అటవీ ప్రాంతమైన పెంబెట్ల గ్రామం వద్ద గుట్టపైన శ్రీరాజరాజేశ్వరుడు వెలసియున్నాడు. తెలియక చేసిన పాపాలు స్వామిని స్మరించిన మాత్రానే పటాపంచలవుతాయని, సంసార ఇబ్బందులు, సకల సంకటాలు, మృత్యు భయాలన్నీ రాజేశ్వర దర్శన మాత్రం చేత తొలగి పోగలవని నమ్మిన తమతో బాంధవ్యం ఏర్పరచుకుని అష్టైశ్వర్యాలు సమకూరుస్తూ, ఎల్ల వేళలా వెన్నంటి కాపాడే కారుణ్యమూర్తి రాజేశ్వరుడని భక్తుల విశ్వాసం. పెంబెట్ల రాజేశ్వరాలయానికి ఘన చరిత్ర ఉంది. ప్రస్తుతం ఉన్న దేవాలయం నూతన కట్టడం కాగా, దీని స్థానంలో ప్రాచీన సనాతన కట్టడం ఉండేదని లభ్యమైన శిలాశాసనాల ద్వారా తెలుస్తున్నది. జగిత్యాల వాస్తవ్యులు, ప్రముఖ చారిత్రక పరిశోధకులు విశ్రాంత ప్రొఫెసర్ జైశెట్టి రమణయ్య పరిశోధన ఫలితంగా ఈ దేవాలయం వెలుగు చూసింది. తెలుగులో చెక్కబడిన పురావస్తు శాఖచే 1974లో ముద్రితమైన శాసనాన్ని బట్టి అంతకుముందే ఇక్కడి ఆలయం ప్రాచుర్యం పొందినట్లు భావించ బడుతున్నది. అటవీ క్షేత్రంలో అలనాడు దుబ్బపై నిర్మితమైన రాజేశ్వరాలయం, 13వ శతాబం నుండే అత్యంత వైభవోపేతంగా విరాజిల్లిన కాకతీయుల కాలపు పుణ్యక్షేత్రంగా గుర్తింపునొందినది. ఆలయ ప్రాంగణంలోనే కాకతీయ ప్రభువుల కళాభిజ్ఞతకు ప్రబల నిదర్శనాలుగా చెక్కబడిన రెండు సుందరమైన ద్వార పాలకుల విగ్రహాలు మిగుల మనోజ్ఞాలుగా నిలిచియున్నాయి. రెండు మూర్తులు కూడా నాలుగేసి చేతులు కలిగియుండి ఉపరి హస్తంలో కుడివైపు చక్రం, ఎడమవైపు శంఖం, మకుటాలు, కుండలాలు, వ్రేయకాలు, హారాలు, కేయూరాలు, మోచేతి, ముంజేతి కడియాలు, కటిబంధం, వనమాల, కాలికడియాలు, నూపురాలు మొదలైన ఆభరణాలతో ఈ అపురూప శిల్పకళాకృతులు చెక్కబడ్డాయి. విగ్రహాల అడుగు భాగాన వింజామరలు వీచే అందమైన సుందరాంగుల ప్రతిమలున్నాయి. ద్వారపాలకుల విగ్రహాల పక్కనే శిథిలమైన ఆనాటి ఆలయ ద్వారశిల్పం, గజ, సింహ ప్రతిమలతో అలరారుతున్నది. లభ్యమైన విగ్రహాలను బట్టి ఇక్కడ ఒక వైష్ణవాలయం ఉండేదని తెలుస్తున్నది. రాజేశ్వర దేవస్థానంలో రామాలయం, ఆంజనేయస్వామి, నవగ్రహ మండపం, వల్లుబండ కలిగి సి.జి.ఎఫ్ నిధులతో గండాదీప, రామాలయ గోపుర నిర్మాణాలు పూర్తి చేశారు.