S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

శివభక్తులకు పండుగ రోజు

షన్మత హిందూ పండుగలలో మహాశివరాత్రి పండుగ ఒకటి. ఇది శివభక్తులకు ముఖ్యమైన పండుగ. ఈ పండుగ ప్రతి ఏటా మాఘమాసంలో కృష్ణ చతుర్దశి నాడు వస్తుంది. ఆ రోజున భక్తులు పగలంతా ఉపవాసం ఉండి, శివకథలు వినడంతోను, కీర్తనలతోను, భజనలతోను, రుద్రాభిషేకంతోను జాగరణ చేస్తారు. పరమేశ్వరుడు ఐశ్వర్య ప్రదాత. మృత్యుంజయుడు. అపమృత్యు నివారణకు శివాభిషేకంలో మనము ఈ శ్లోకము పఠిస్తాము.
శ్లో॥ త్య్రంబకం యజామహే సుగన్ధిం పుష్టి వర్ధనమ్/ ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్
శివునికి సంబంధించి తైత్తిరీయోపనిషత్తులో ఒక మంత్రము ఇట్లున్నది.
మంత్రము: తత్పురుషాయ విద్మహే/ మహాదేవాయ ధీమహి/ తన్నోరుదః ప్రచోదయాత్
మాఘ బహుళ చతుర్దశి నాడు జ్వాలాస్తంభంలో తేజోలింగంగా మహాశివుడు ఆవిర్భవిస్తాడు. అందువలన ఈ రోజు మహాశివరాత్రిగా లోకంలో ప్రసిద్ధి పొందింది.
శ్లో॥ శివరాత్రి మహారాత్రం నిరాహారో జితేంద్రియః/ అర్చయే ద్వా యథా న్యాయం యథా బల మవంచకః
యత్ఫలం లభతే సద్యః శివరాత్రౌ మదర్శనాత్
భావము: శివరాత్రి పర్వదినాన దివారాత్రములు ఉపవాసముండి, ఇంద్రియ నిగ్రహంతో విధి విధానంగా శివుని అర్చించేవారు ఒక సంవత్సర కాలం శివుని పూజిస్తే వచ్చే ఉత్తమ ఫలాన్ని శివరాత్రినాడు ఒక్కరోజే పొందగలరు. శివరాత్రి రోజు శివుని స్మరించినవారు కూడా శివసాన్నిధ్యం పొందగలుగుతారు.
శివుని గూర్చి, మహాశివరాత్రిని గూర్చి శ్రీనాథ మహాకవి శివరాత్రి మాహాత్మ్యమునందు, భవిష్య పురాణమునందు, ఆలంపురీ మాహాత్మ్యమునందు, లింగ పురాణమునందు తైత్తిరీయోపనిషత్తు నందు, శివపురాణమునందు వివరింపబడ్డాయి.
శంకరుడు శుభకరుడు, చిదానందాన్ని ఇచ్చేవాడు (శంకరోతి శంకరః) మహాదేవుని భక్తిప్రపత్తులతో స్మరించే ప్రతి జీవికి ఇహపర సుఖములతోపాటు ముక్తిని శివుడు ప్రసాదిస్తాడు.
కాళిదాసు తన రఘువంశంలో పార్వతీ పరమేశ్వరులు కలిసి ఉంటారని ఆదిదంపతులను ఈ శ్లోకంలో స్తుతించాడు.
శ్లో॥ వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే/ జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ
శ్రీరాముడు త్రేతాయుగంలో, శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో శివుని పూజించి తమ కోరికలను నెరవేర్చుకున్నారు. ఓం నమశ్శివాయః అను పంచాక్షరీ మంత్రంలో శివునికి పంచభూతాత్మకమైన సర్వవ్యాపకత్వము కలదని తెలియుచున్నది. అక్షరములలో ఓం పరమేశ్వరుడు 1.న = నభము = ఆకాశము 2.తురుత్తు = అనగా గాలి 3.శి = శిఖ అనగా అగ్ని 4.వ అనగా నీరు - 5.య = పృథ్వి అనగా నేల అను అర్థములు కలవు.
లింగ పురాణములో ఈ పర్వదినమును గూర్చి ఇట్లు శివుడు చెప్పినట్లున్నది. ‘ఈ పర్వదినమున ఎవ్వడైనను తెలిసికొని తెలియక కాని పరమేశ్వరుని ఆరాధించినచో వాడెంత పాపాత్ముడైనను సరే సర్వ పాపముల నుండి విముక్తుడై మోక్షమును పొందగలడు’ అని కలదు. వ్యాస మహర్షి రచించిన 18 పురాణములలో శివ పురాణమొకటి. అందు:
శ్లో॥ పఠనాచ్ఛ శ్రవణా దస్య భక్తి మాన్నర సత్తమః/ సద్య శివప్రద ప్రాప్తిం లభ్యతే సర్వసాధనాత్
భావము: శివ పురాణాన్ని భక్తిశ్రద్ధలతో పఠించేవారు, ఆలకించేవారు, శివుని ఆరాధించేవారు మానవుల్లో ఉత్తములై ఈ లోకంలో అన్ని సుఖాలు పొంది మరణానంతరం శివపదాన్ని చేరుకుంటారు.
శ్లో॥ శ్రుతి స్మృతి పురాణా నామాలయం కరుణాలయం/ నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం
భావము: వేదాల్లో, స్మృతులలో, పురాణాలలో మూల స్వరూపుడుగా కీర్తింపబడి శుభాలను ఇచ్చే శంకర భగవానుని పాదారవిందములను మ్రొక్కుచున్నాను.
శైవ మత ప్రాశస్త్యము
హిందువులు షణ్మతములలో (1.శైవము 2.వైష్ణవము 3.శాక్తము 4.గానాపతము 5.సౌరము 6.కాపాలికము) ఆంధ్రదేశమునందు కాని, హిందూ దేశమునందు కాని శైవ మతము ప్రముఖ స్థానము కలిగి ఉన్నది. ఆంధ్రదేశమునకు తెలుగుదేశము అను పేరు వచ్చుటకు కారణము ఈ దేశము త్రిలింగా వృతమగుటయే. ఆ త్రిలింగములు తూ.గో.జిల్లాలోని దక్షారామములోని భీమేశ్వర లింగము, కరీంనగర్ జిల్లాలోని మంథని తాలూకాలోని కాళేశ్వర లింగము, కర్నూలు జిల్లాలోని శ్రీశైలంలోని మల్లికార్జున లింగాల మధ్యలోనున్నది త్రిలింగ దేశము, అదియే తెలుగుదేశము. అంతేకాదు శివునకు అభీష్టములైన ఆరామములు ఆంధ్రప్రదేశ్ రాష్టమ్రులో ఐదున్నవి. అవి 1.దక్షారామము 2.కుమారామము 3.క్షీరారామము 4.సోమారామము 5.అమరారామము అనునవి.
భారతదేశమునందలి జ్యోతిర్లింగాలు
యావద్భారత దేశంలోను 12 జ్యోతిర్లింగాలున్నాయి. ఇవి సుప్రసిద్ధమైన శివక్షేత్రాలు. అవి 1.సోమనాథ క్షేత్రము (సౌరాష్ట్ర) 2.శ్రీశైలం - మల్లికార్జున క్షేత్రం 3.మహాకాళేశ్వర క్షేత్రం - ఉజ్జయిని (మధ్యప్రదేశ్), 4.ఓంకారేశ్వర క్షేత్రం, శివపురి (మధ్యప్రదేశ్) 5.కాశీ విశే్వశ్వర క్షేత్రం - వారణాసి (ఉత్తరప్రదేశ్) 6.వైద్యనాథ క్షేత్రం - దేవగఢ్ ఝార్ఖండ్) 7.కేదార్‌నాథ్ - కేదారేశ్వర క్షేత్రం (ఉత్తరాఖండ్) 8.నాగేశ్వర క్షేత్రం - ద్వారక (గుజరాత్) 9.ఘృష్ణేశ్వర క్షేత్రం - ఔరంగాబాద్ (మహారాష్ట్ర) 10.త్య్రంబకేశ్వర క్షేత్రం - నాసిక్ (మహారాష్ట్ర) 11.రామేశ్వర క్షేత్రం - రామేశ్వరం (తమిళనాడు) 12.్భమశంకర క్షేత్రం - మంచార్ (మహారాష్ట్ర) అనునవి.
శివరాత్రి పర్వదినం నాడు యావద్భారతంలోను ప్రతి గ్రామంలోనున్న శివాలయంలో భక్తులు ఉదయం నుండి రాత్రి వరకు ప్రార్థనలు, పూజలు చేస్తూ రాత్రి జాగారం చేస్తూ శివరాధనలో తెల్లవారేవరకు ఉంటూ తరిస్తారు.

-రాపాక ఏకాంబరాచార్యులు 94404 94752