S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎలావుందీ వారం? ( ఫిబ్రవరి 28 నుండి మార్చి 5 వరకు)

మేషం (ఏప్రిల్ 15 - మే 14)

ఉన్న వనరులను పొదుపుగా వాడుకోవలసిన తరుణమిది. వారారంభంలో పనులు సక్రమంగా సాగక సతమతమవుతారు. సన్నిహితుల ప్రోద్బలంతో కొన్ని దీర్ఘకాల వ్యవహారాలు గురు, శుక్రవారాల్లో తలపెట్టుకుంటారు. క్రీడాకారులు, కళాకారులు, ప్రముఖుల మన్ననలను అందుకుంటారు. శుభకార్యాలకు హాజరవుతారు. సభలు, సమావేశాలు, పరిచయాలు, పరామర్శలు ఈ వారంలో ప్రాముఖ్యత సంతరించుకుంటాయి. ఆర్థిక లావాదేవీలు మొత్తం మీద ఫలప్రదంగానే ఉంటాయి.

వృషభం (మే 15 - జూన్ 14)

అభ్యంతరాలు, అనుమానాలు తొలగి దూరమైన ఆత్మీయులు కొందరు చేరువవుతారు. ఆలస్యంగానైనా వాస్తవాలను గ్రహించి వృత్తి ఉద్యోగాలలో మార్పులకు పూనుకుంటారు. పర్మిట్లు, ధృవపత్రాలు చేతికందడంతో అనుయాయులతో కూడి భవిష్యత్ కార్యాచరణను తయారుచేస్తారు. గురు, శుక్రవారాల్లో ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్త అవసరం. విదేశీయానాలు, దూర ప్రయాణాలకు అవకాశాలు మెరుగవుతాయి.

మిథునం (జూన్ 15 - జూలై 14)

పూర్తి అవగాహన ఏర్పడిన తరువాత నూతన ప్రణాళికలు తలపెట్టుకోవడం ఉత్తమం. లక్ష్యాలకు చేరువగా ఉన్నా పనులు మందకొడిగా సాగడం మీకు ఆవేదన కలిగించవచ్చు. స్వీయ పర్యవేక్షణతో కొన్ని వ్యవహారాలు ముగింపునకు వస్తాయి. సోదర వర్గంతో కలిసి శుభకార్యాలను జయప్రదంగా నిర్వహిస్తారు. ధనలోపం లేకపోయినా వృధా ఖర్చులను తగ్గించడం కోసం ప్రయత్నిస్తారు. ఇతరుల విషయంలో తలదూరిస్తే ఇక్కట్లు తప్పవు.

కర్కాటకం (జూలై 15 - ఆగస్టు 14)

అవసరాలను దృష్టిలో ఉంచుకుని దినచర్యలలో మార్పులు చేయడం తప్పనిసరి అవుతుంది. ముల్లును ముల్లుతోనే తీయాలనే సూత్రం ఈ వారం మీకు వర్తిస్తుంది. ప్రతిభావంతులుగా పెద్దల దృష్టిలో గుర్తించబడతారు. స్థిరాస్తులకై ధనం వినియోగిస్తారు. భాగస్వాముల నుండి తగిన ప్రోత్సాహం లభిస్తుంది. పట్టుదలతో కృషిచేసి మీ లక్ష్యాలను చేరుకోగలగడం చెప్పుకోదగ్గ విశేషం.

సింహం (ఆగస్టు 15 - సెప్టెంబర్ 14)

ఇతరుల అభిమతాలు గ్రహించి ఉభయ కుశలోపరిగా ఉండే వ్యవహారాలను చేపడతారు. ఒప్పందాలు, ఆర్థిక నిర్ణయాలలో పునః పరిశీలన ఉత్తమం. అభ్యంతరాలను పక్కకునెట్టి దీర్ఘకాల ప్రణాళికల వైపు మొగ్గు చూపుతారు. సర్వీసులు, రాతపనుల ద్వారా ఆదాయం పెరుగుతుంది. స్థిరత్వం కోసం మీరు చేసే ప్రయత్నాలకు సన్నిహితుల తోడ్పాటు లభిస్తుంది. ఆత్మీయుల ఆరోగ్యంలో మార్పు ఏర్పడవచ్చు.

కన్య ( సెప్టెంబర్ 15- అక్టోబర్ 14)

వృత్తి వాణిజ్యాలు వేగం పుంజుకుంటాయని ఆశించవచ్చు. రావనుకున్న ఆదాయం, వ్యక్తిగత సహకారం మీకు మంగళ, బుధవారాల్లో లభిస్తాయి. ఆత్మీయులు మీపై ప్రేమాభిమానాలు వ్యక్తీకరించి ప్రోత్సహిస్తారు. వారాంతంలో చిరకాల కోరికలు కొన్ని ఈడేరుతాయనవచ్చు. నేతల ప్రాబల్యం పెరుగుతుంది. చురుగ్గా విధులు నిర్వర్తించి అందరి దృష్టిని ఆకర్షిస్తారు. అనుకోని ప్రయాణాలు చేయవలసి రావచ్చు. నిగూఢ రహస్యాలు కొన్ని తెలుసుకుంటారు.

తుల (అక్టోబర్ 15- నవంబర్ 14)

రోజువారీ కార్యక్రమాలలో మార్పులు చోటు చేసుకుంటాయి. పనులు సకాలంలో పూర్తవాలంటే కఠినంగా వ్యవహరించక తప్పదని గ్రహిస్తారు. సమాజంలో, వృత్తి ఉద్యోగాల్లో మీకు ఆదరణ, ప్రాధాన్యత ద్విగుణీకృతమవుతాయి. మీ అభిప్రాయాలు, ప్రణాళికలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటాయి. శుభ సంకేతాలు అందుతాయి. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండడం, అనవసరమైన జాలి చూపించకపోవడం ఉత్తమం. మనశ్శాంతి లభిస్తుంది.

వృశ్చికం (నవంబర్ 15-డిసెంబర్ 14)

ముఖ్యావసరాలను గుర్తించి సత్వర ప్రణాళికలు తయారుచేసుకుంటారు. అన్ని వర్గాల వారు మీ ప్రయత్నాలకు సహకరిస్తారని చెప్పవచ్చు. స్పెక్యులేషన్, కళారంగాల ద్వారా ఆదాయం, పేరు ప్రతిష్టలు లభ్యమవుతాయి. నూతన ప్రాకారాలు, కట్టడాలపై పెట్టుబడులు అవసరమవుతాయి. స్ర్తిలు, సోదర వర్గం నుండి ఆదరాభిమానాలు పొందుతారు. విద్యా, ఉద్యోగాలలో మార్పులకు ఆస్కారం మెండు. ఒత్తిడులను అధిగమించి ఉన్నతమైన ఫలితాలను సాధించగలుగుతారు. ఆరోగ్యం మెరుగవుతుంది.

ధనస్సు (డిసెంబర్ 15-జనవరి 14)

ఎన్ని కష్టాలొచ్చినా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగే సత్తా ఉందని నిరూపిస్తారు. సోమ, మంగళ వారాల్లో భేదాభిప్రాయాలు తలెత్తకుండా జాగ్రత్త వహించండి. ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు అవకాశాలు మెరుగవుతాయనవచ్చు. మంగళ, బుధవారాల్లో ఆరోగ్యపరంగా జాగ్రత్త వహించడం ఉత్తమం. మనసులోని బాధలు, భయాలను ఆత్మీయులతో పంచుకొని తగ్గించుకో గలుగుతారు. ప్రయాణాలు వాయిదా పడవచ్చు.

మకరం (జనవరి 15-ఫిబ్రవరి 14)

ఆత్మవిశ్వాసంతో కృషి చేసి ఇతరులు ఊహించని ఫలితాలను సాధిస్తారు. ప్రత్యర్థులు కూడా మీకు మిత్రులుగా మారుతారనవచ్చు. మీ నేతృత్వంలో బృహత్ కార్యక్రమాలు జరిగే సూచనలున్నాయి. గృహావసరాలు, ఆత్మీయుల కోసం ఖర్చులు పెరుగుతాయి. అనవసర బాధ్యతలను తలకెత్తుకోకండి. యంత్ర వాహనాల వాడుకలో మెలకువగా ఉండటం శ్రేయస్కరం. అభిమానులు, అనుయాయుల అభిమతాలు నెరవేర్చేందుకు కృషి చేస్తారు.

కుంభం (ఫిబ్రవరి 15-మార్చి 14)

నైరాశ్యం వీడి ఆత్మవిశ్వాసంతో వృత్తి ఉద్యోగాలు నిర్వహిస్తారు. పుణ్యస్థలాలు, దేవాలయాలు సందర్శిస్తారు. ప్రముఖుల కలయిక, వినోద కార్యక్రమాలు, నూతన విద్యా వ్యాపకాలు మీలో ఉత్సాహాన్ని పెంచుతాయనవచ్చు. గృహ వాతావరణం మొత్తం మీద సంతృప్తికరంగానే ఉంటుంది. ప్రణాళికలలో మార్పులు, నూతన లక్ష్యాలు, నివేదికలు, నిర్ణయాలు మీ వ్యవహార సరళిలో మార్పులు తెస్తాయనవచ్చు. సన్నిహితుల అలుకలు తీర్చి, బుజ్జగించి కార్యోన్ముఖులను చేస్తారు. క్రీడలు, కళలు ఆకర్షిస్తాయి.

మీనం ( మార్చి 15- ఏప్రిల్ 14)

పెద్దలతో చర్చలు, రచనా వ్యాసంగాలు ఉల్లాసభరితంగా ఉంటాయి. ఆధ్యాత్మికపరంగా పరిణతి సాధిస్తారనవచ్చు. ఆశయాల సాధనలో కొంత సమయం వేచి ఉండటం తప్పదని గ్రహిస్తారు. వివిధ రంగాలలో ప్రశంసలు, జ్ఞాపికలను అందించేదిగా ఉంటుందనవచ్చు. అవసరమైన డబ్బు ముందు వెనుకలుగా మీ చేతికందుతుంది. ఇంటా బయటా పనులు చురుగ్గా సాగడం, కొత్త పనులు గురు, శుక్రవారాల్లో చేపట్టడం గమనార్హం. ముఖ్య సంకల్పం నెరవేరుతుంది.

ఎస్.రవిప్రకాశ్